Pragathi: ఎత్తిపడేస్తున్న ప్రగతి ఆంటీ.. 48 ఏళ్ల వయస్సులో రేర్ ఫీట్..!
టాలీవుడ్ లో తల్లి, అత్త పాత్రలు అనగానే గుర్తుకొచ్చే నటి ప్రగతి. ఆమె చాలా మూవీల్లో అమ్మగా, అత్తగా నటించి సత్తా చాటారు. అయితే ప్రగతి ఈ మధ్య హెల్త్ పై దృష్టి సారించారు. జిమ్ కు వెళ్తూ వర్కవుట్లు చేస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు. అమెకు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. అయితే ప్రగతి 48 వయస్సులో చేసే వర్కవుట్లు చూసి చాలా మంది యువత ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఆమె జిమ్ లో వర్కవుట్ చేయడమే కాదు.. వెయిట్ లిఫ్ట్ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. అంతేకాదు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా పాల్గొంటున్నారు. తాజాగా ప్రగతి సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ 2024లో పోటీ పడ్డారు. ప్రగతి ఈ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రగతి 80 కిలోల వెయిట్ ను సింపుల్ గా ఎత్తేస్తున్నారు. ఇది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.

48 ఏళ్ల వయసులో కష్టపడి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో సౌత్ ఇండియన్ ఛాంపియన్ గా నిలవడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.గతేడాది నవంబర్ లో బెంగళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కూడా ప్రగతి పాల్గొన్నారు. ఈ పోటీలో ప్రగతి మూడో స్థానంలో నిలిచారు. కాంస్య పతకం సాధించారు. బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా ఈ పోటీలు జరిగిన సంగతి తెలిసిందే.
ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్లతో పోటీ పడి ప్రగతి ఈ పతకం సాధించడం గొప్ప విషయంగా చెప్పొచ్చు. ప్రగతి చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సాఫ్ట్ గా కనిపించే ప్రగతి వెయిట్ లిఫ్టర్ గా ఎదగడం గొప్ప విషయమని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications