టాలీవుడ్ హీరోల సంచలన నిర్ణయం

తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కడమేకాదు.. కథను బలంగా చేసుకొని మాత్రమే సినిమాలను ప్రేక్షకులకు అందిస్తోంది. రోజురోజుకు దర్శకులు విభిన్నమైన కథలను సిద్ధం చేస్తుండటంతో ప్రతిభావంతమైన సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. వీరిలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అగ్ర కథానాయకులుగా ఉన్నారు. అలా కాకుండా ఈ తరం స్టార్ హీరోల్లో ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటివారు ఇప్పటికే పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు.

వీరు తెరకెక్కించే ప్రతి చిత్రాన్ని పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు. అందుకనుగుణంగానే కథలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇదేకోవలో టైర్ 2 హీరోలు కూడా పయనిస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లాంటివారు మాత్రం పాన్ ఇండియా సినిమాలు కాకుండా కేవలం తెలుగు పరిశ్రమ వరకే చేస్తున్నారు. వీరిని మినహాయిస్తే రామ్, నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, కల్యాణ్ రామ్ లాంటివారంతా టైర్2 హీరోలుగా పరిశ్రమలో కొనసాగుతున్నారు.

tollywood heros sensational decission

ఇకనుంచి వీరు తెరకెక్కించబోయే ప్రతి చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలోనే తీయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ పరిశ్రమలకు చెందిన ప్రేక్షకులను ఆకర్షించవచ్చని, ఆయా ఇండస్ట్రీల్లో కూడా సినిమాలు హిట్ అయ్యేలా యూనిక్ కథలను ఎంచుకుంటే సరిపోతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం తాము చేస్తున్న సినిమాలను కూడా ఇలాగే తెరకెక్కిస్తున్నారు. భవిష్యత్తులో చేయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా విడుదల కానున్నాయి. గతంలో కొన్ని కొన్ని చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ పాన్ ఇండియా సినిమాలు చేయడంవల్ల మార్కెట్ పరిధి పెరుగుతుందని వీరంతా అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+