మాల ధరించి ఇలాంటి పనులు చేస్తారా..? బండ్ల గణేష్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు..
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్లగణేష్ నిత్యం ఏదో ఒక పనిచేస్తూ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంటారు. తాజాగా ఆయన దీపావళి పండుగ సందర్బంగా పెద్ద బణాసంచా తెప్పంచి ఊరంతా పంచి పెట్టారు. ఈసందర్భంగా సోషల్‌మీడియాలో పండుగ రోజే ఆయన వైరల్‌గా మారారు. అయితే, కొన్ని సందర్భాల్లో బండ్ల గణేష్ చేసే పనులు నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యేలా ఉంటాయి. తాజాగా మరో ఘటనతో నిర్మాత బండ్లగణేష్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
మాల ధరించిన బండ్ల గణేష్..:బండ్ల గణేష్‌కు దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టం. ప్రతి ఏటా ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే పెద్దె ఎత్తున బాణాసంచా తెప్పించారు నటుడు బండ్లగణేష్. ఆ బాణాసంచానంతా ఊరందరికి పంచిపెట్టారు. ఎంతో సంబరంగా అందరితో కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు. అయితే, ఈ ఏడాది బండ్లగణేష్ అయ్యప్ప మాల ధరించి ఉన్నారు. అయితే, మాలలో ఉండి చెప్పులు ధరించి మరీ క్రాకర్స్ కాల్చారు బండ్లగణేష్. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పడు వైరల్‌గా మారింది.

ఈ ఫోటోను చూసిన చాలామంది నెటిజన్లు ఆయనను ఏకిపారేస్తున్నారు. మరికొందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయ్యప్ప మాల చాలా పవిత్రమైనది. దాన్ని ఇలా అపవిత్రం చేయకండి అంటూ కొందరు నెటిజన్లు బండ్లగణేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప మాల ధరించి ఇలాంటి పనులు చేయడం తప్పని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, కొందరేమో మాల ధరించి ఇలాంటి పనులు చేస్తారా అంటూ బండ్లగణేష్‌ను ఏకిపారేస్తున్నారు. ఏదిఏమైనా బండ్లగణేష్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయంపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..












Click it and Unblock the Notifications