"నేను పాన్ సెక్సువల్".. కోరిక తీర్చుకోవడానికి జెండర్ తో పనేంటి..? దుమారం రేపుతున్న "ఫిదా" బ్యూటీ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ గాయత్రి గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ కాంట్రొవర్షియల్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఫిదా, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీత ఆన్ ది రెడ్, బుర్రకథ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈమె ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్, ఫెమినిజం, బిగ్ బాస్ షో లోని విషయాలు చెప్పడం హాట్ టాపిక్ గా మారాయి. ఫెమినిజం, పురుషాధిక్యత, వస్త్రధారణ తదితర అంశాలపై తన వాయిస్‌ని గట్టిగా వినిపిస్తూ ఉంటుంది.
అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో భాగంగా షాకింగ్ విషయాలు బయట పెట్టింది గాయత్రి గుప్తా. "నేను కూడా పాన్ సెక్సువల్" అని తెలిపింది. ఈ పాన్ సెక్సువల్ అనేది ఒక రకమైన లైంగిక ధోరణి లాంటిది. ఈ ధోరణిలో ఉన్న వ్యక్తులు ఇతరుల పట్ల లింగం, లైంగిక గుర్తింపు లాంటివి చూసుకోకుండా ప్రేమగా లేదా లైంగికంగా ఆకర్షితులు అవుతారు.
పాన్ సెక్సువల్ అంటే ఏ జెండర్ అయినా కోరికలు కలగడం. సాధారణంగా అమ్మాయిలు.. అబ్బాయిలను చూసి ఆకర్షితులు అవుతారు. అబ్బాయిలకు.. అమ్మాయిల మీద కోరికలు పుడతాయి. ఇది సహజం. అయితే ఈ మధ్య కాలంలో అబ్బాయిలకు అబ్బాయిల మీద, అమ్మాయిలకు అమ్మాయిల మీద కోరికలు పుడుతున్నాయి. అని గాయత్రి గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతేకాక పాన్ సెక్సువల్ వాళ్లు జెండర్ తో సంబంధం లేకుండా ఆడ, మగ,ట్రాన్స్ జెండర్ ఎవరి పైన కూడా ప్రేమ పుడుతుందని.. వారితో శృంగారం చేయగలరని పేర్కొంది. వారికి ఎవరిని చూసినా కోరిక కలుగుతుంది.. అలాంటి వారికి జెండర్ ముఖ్యం కాదు. ఆ వ్యక్తి ఎలాంటి వారు..? ప్రేమను పంచుతున్నారా..? సుఖం అందిస్తున్నారా..? అనేది ముఖ్యం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications