ఇంట్లో 16 అడుగుల కింగ్ కోబ్రాతో టాలీవుడ్ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా..? వీడియో వైరల్
సాధారణంగా ఇంట్లో బల్లిని చూస్తేనే చాలామంది ఎగిరి గంతేస్తారు. కానీ ఆ టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో ఏకంగా 16 అడుగులు కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. అత్యంత విషపూరితమైన ఈ నాగుపాము ఆమె ఇంట్లోకి ఎలా ప్రవేశించింది..? ఈ హీరోయిన్ కింగ్ కోబ్రాతో చేసిన పని చూస్తే షాక్ అవుతారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

వెళ్లవయ్యా.. వెళ్లు అంటూ జయం సినిమాతో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది హీరోయిన్ సదా. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి యువతకు దగ్గరైంది. ఈ మధ్య సినిమాలు చేయడం మానేసి కొన్ని రియాల్టీ షోలకు వ్యాఖ్యాతగా మారింది. అయితే తాజాగా ఆమె ఎవరూ చేయలేని సాహసం చేసింది. ఎవరైనా ఇంట్లో పామును చూస్తే వామ్మో అని పరుగులు తీస్తారు. కానీ ఈ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాను పట్టేసి అడవిలోకి తీసుకెళ్లి వదిలి పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. విశాఖపట్నం సమీపంలోని అరకులో నిర్మిస్తోన్న ఓ భవనంలోకి 16 అడుగుల కింగ్ కోబ్రా దూరింది. దీంతో స్థానికులు భయపడిపోయి స్నేక్ క్యాచింగ్ టీమ్ కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే అక్కడకు వచ్చింది. అయితే వారితో పాటు టాలీవుడ్ హీరోయిన్ సదా కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొని తాచుపామును పట్టుకుని పోయి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టింది. అందరూ ఆమె ధైర్య సాహసాలకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications