తెలుగు సినీ చరిత్రలో ఇప్పటివరకు ‘యూట్యూబ్’ లో ఎక్కువమంది చూసిన సినిమా

తెలుగులో ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిని ఓటీటీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని మాత్రం యూట్యూబ్ లో వస్తున్నాయి. ఓటీటీలు కొనుగోలు చేసిన తర్వాత అవి యూట్యూబ్ లోకి రావు. అయితే 2026 సంవత్సరం వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే తెలుగులో విడుదలైన సినిమాల్లో ఓ సినిమా మాత్రం యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ దక్కించుకొని సంచలన రికార్డు సృష్టించింది. అంటే ఇది కేవలం ఒక తెలుగు సినిమా, ఒక్క తెలుగు భాషలోనే చూసినవారితో వచ్చిన వ్యూస్. ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసి, యూట్యూబ్ లో విడుదల చేసి వాటిని కూడా కలుపుకున్న వ్యూస్ కాదు. కేవలం తెలుగు వ్యూస్. ఆ ప్రకారం చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం ఇప్పటివరకు యూట్యూబ్ లో అత్యధిక వీక్షణలు దక్కిచుకున్న సినిమాగా రికార్డులకెక్కింది.

236 మిలియన్లతో రికార్డు

ప్రిన్స్ నటించిన 'శ్రీమంతుడు' సినిమా 2015లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే సమయంలో బాహుబలి సినిమా కూడా విడుదలైంది. ఒక్క తెలుగు వరకు చూసుకుంటే శ్రీమంతుడు భారీ రికార్డులను నెలకొల్పింది. తెలుగు వెర్షన్‌లో యూట్యూబ్ చరిత్రలో ఒక మైలురాయిని సృష్టించింది. 236 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, ఎక్కువమంది చూసిన తెలుగు సినిమాగా మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదు.. మధ్యలో స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూసిన సినిమా కూడా ఇదే.

Tollywood The most viewed movie on YouTube in Telugu cinema history so far

రెండు, మూడు స్థానాల్లో నాని, శర్వానంద్

ఒక గ్రామాన్ని దత్తత తీసుకునే యువకుడి కథతో తెరకెక్కిన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని 'నాన్-బాహుబలి' రికార్డులను సైతం తిరగరాసింది. ఇప్పటికీ దీనికి రోజువారీగా భారీ సంఖ్యలో వ్యూస్ వస్తుంటాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రుతిహాసన్ నటించగా, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, ముఖేష్ ఋషి, సంపత్ రాజ్, రాహుల్ రవీంద్రన్, సుకన్య, సితార, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సామాజిక సందేశంతో కొరటాల తీర్చిదిద్దిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో ఒక కలికితురాయిగా నిలిచిపోయింది. శ్రీమంతుడు సినిమా తర్వాత నాని నటించిన నేను లోకల్ 115 మిలియన్ల వ్యూస్ తో రెండో స్థానంలో, శర్వానంద్ నటించిన శతమానం భవతి 100 మిలియన్ల వ్యూస్ తో మూడో స్థానంలో నిలిచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+