ఓ ఇంటివాడయిన టాలీవుడ్ యంగ్ హీరో..
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్ ఓ ఇంటివాడయ్యాడు. 'కేరింత' సినిమాతో తెలుగు పరిశ్రమకు నటుడిగా పరిచయమైన విశ్వంత్.. తాజాగా పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా విశ్వంత్ భార్య భావనే సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. వారి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె నెట్టింట్లో షేర్ చేశారు. దీంతో వీరి పెళ్లి విషయం కాస్త బయటపడింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి.
విశ్వంత్ కేరింతతో పాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు. ఈ యంగ్ హీరో సామర్లకోటకు చెందినవాడు. అయితే, ఇతనికి అమెరికాలో ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలోనే కేరింత సినిమాలో ఆఫర్ వచ్చింది. దీంతో చదువును మధ్యలో ఆపేసి సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశాడు. కేరింత సినిమా మంచి విజయం సాధించడంతో విశ్వంత్‌కు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస అవకాశాలు లభించాయి. అలా కేరింత మూవీ తర్వాత మనమంతా, జెర్సీ, ఓ పిట్టకథ, మ్యాచ్ ఫిక్సింగ్, హైడ్ అండ్ సీక్, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, కథ వెనక కథ వంటి చిత్రాలు చేశాడు.

గేమ్ ఛేంజర్ మూవీలో..
తాజాగా విశ్వంత్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. అయితే, ఈ యంగ్ హీరో ఎంగేజ్‌మెంట్ ఆగస్ట్‌లో జరిగింది. ఇప్పుడు ఎటువంటి హడావుడి లేకుండానే భావన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలోనే వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లివార్త తెలిసిన పలువురు నెటిజన్లు, సహ నటీనటులు ఈ కొత్తజంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications