2024లో టాప్-5 భారీ డిజాస్టర్ మూవీస్
2024 సంవత్సరంలో సినీ పరిశ్రమకు మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెప్పొచ్చు. అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది. హిందీలోనే రూ.700 నుంచి రూ.800 కోట్లు కొల్లగొట్టే అవకాశం కనపడుతోంది. మరోవైపు ఈ సంవత్సరంలోనే విడుదలైన సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ ఏడాదిలో అత్యంత చెత్త సినిమాలుగా, బిగ్గెస్ట్ ఫ్లాప్స్ ను మూటకట్టుకున్న సినిమాల గురించిన వివరాలు తెలుసుకుందాం.
'కంగువ'
దక్షిణాది సూపర్ స్టార్ సూర్య భారీ అంచనాల నడుమ నటించిన ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ అవన్నీ అడియాశలయ్యాయి. పది సంవత్సరాలుగా సరైన సూపర్ హిట్ సినిమాను సూర్య సాధించలేకపోతున్నాడు. రూ.350 కోట్ల బడ్జెట్ తో కంగువ సినిమాను శివ దర్శకత్వంలో నిర్మిస్తే కేవలం రూ.105 కోట్లు రాబట్టి ఈ ఏడాదికి అత్యంత భారీ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. భారీ తారాగణం ఈ సినిమాలో ఉన్నప్పటికీ దీన్ని ఫ్లాప్ నుంచి మాత్రం తప్పించలేకపోయారు.

భారతీయుడు 2
శంకర్ సినిమా అంటే కమర్షియల్ హంగులకు సామాజిక అంశాన్ని జోడిస్తాడు. భారతీయుడు చరిత్ర తిరగరాసింది. ఇప్పుడు భారతీయుడు2 తీస్తే అది కూడా అత్యంత చెత్త సినిమాగా రికార్డును తిరగరాసింది. ఈ సినిమా షూటింగ్ జరగడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. గేమ్ ఛేంజర్ మధ్యలో ఆపేసి శంకర్ ఈ సినిమా తీస్తే చెత్త సినిమాగా నిలిచింది. రూ.250 కోట్లు ఖర్చుపెడితే రూ.151 కోట్లు వచ్చాయి.
మైదాన్
అజయ్ దేవగన్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మైదాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. రూ.250 కోట్లు పెట్టి నిర్మిస్తే కేవలం రూ.71 కోట్లు వచ్చాయి. సింగం అగైన్ సినిమా రూ.275 కోట్లు మాత్రమే రాబట్టింది.
బడే మియాన్ చోటే మియాన్
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తిప్పికొట్టారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తే కేవలం రూ.110 కోట్లు వచ్చాయి.
జిగ్రా
అలియా భట్, వేదాంగ్ రైనా జంటగా నటించిన ఈ చిత్రం రూ.100 బడ్జెట్ తో తెరకెక్కింది. రూ.55 కోట్లు రాబట్టి టాప్-5 చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచింది.












Click it and Unblock the Notifications