జైలుకెళ్లిన అతనే టాప్ హీరో

2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఇక ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడించింది. ముఖ్యంగా తెలుగు హీరోలు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బాలీవుడ్ హీరోలను కాదని మరీ తెలుగు హీరోలు ముందంజలో నిలిచారు.

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా మూవీ 'కల్కి '.ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెకకెక్కిన ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. కల్కి మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను దుమ్ము దులిపేసింది. మొదటి రోజు (గురువారం) రూ.191.5 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం.ఇక వరల్డ్ వైడ్‌గా కల్కి మూవీకి రూ. 536.81 కోట్ల షెర్ కలెక్షన్స్, రూ. 1055.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థలు వెల్లడించాయి.

Top Hero in India in 2024

ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింగిల్ హీరోగా కనిపించడంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకున్నారు. ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమాలోని సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు డివైట్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత సూపర్ హిట్ దిశగా 'దేవర' దూసుకుపోయింది. దసరా సెలవులు 'దేవర'కు కలిసి వచ్చాయనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దేవర' భారీ వసూళ్లను సాధిస్తోంది. సినిమా మొదటి రోజునే వరల్డ్ వైడ్‌గా రూ. 172 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 500 కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ రాబ‌ట్టింది.

మరో తెలుగు హీరో అల్లు అర్జున్ సైతం ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద తన స్టామినా నిరూపించాడు. పుష్ప సినిమాతో ఇండియా మొత్తం తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకుని సత్తా చాటాడు. నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇక పుష్ప-2 సినిమాతో మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేశాడు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 294 కోట్ల వసూళ్లు రాబట్టింది.

దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఓవరాల్‌గా 14 రోజుల్లోనే ఈ సినిమా రూ.1500 కోట్లు కలెక్ట్ చేసింది. 100 సంవత్సరాల బాలీవుడ్ చరిత్రలో పుష్ప-2 కొత్త రికార్డ్ సృష్టించింది. పుష్ప-2 కేవలం 20 రోజుల్లోనే రూ. 700 కోట్ల వసూళ్లను సాధించింది. ఇదే అతిపెద్ద హిందీ నెట్‌గా మారింది. నిర్మాత‌ల‌కు అత్య‌ధిక లాభాల‌ను తెచ్చిపెట్టిన సినిమాల్లో పుష్ప-2 ఒక‌టిగా నిలిచింది. మరోవైపు బాలీవుడ్ హీరోలు వెనుకపడినప్పటికీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన 'స్త్రీ-2' అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రూ. 625 కోట్లు వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ ఏడాది టాప్ హీరోల జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+