నెంబర్ వన్ హీరోయిన్ ఆమే... టాప్-10 హీరోయిన్లు వీళ్లే!

సినీపరిశ్రమలో ఉన్న హీరోల గురించి వారి అభిమానులు ఘర్షణ పడుతుంటారు. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటుంటారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తుంటుంది. అయితే ఇలా పోటీల గురించి చర్చ జరిగిన ప్రతిసారీ హీరోయిన్లకు అభిమానులుండరా? వారిగురించి చర్చించరా? అని కొందరికి సందేహం వస్తుంటుంది. వాస్తవానికి హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అవకాశాలు వస్తుంటాయా? అనేది వారి అదృష్టం, ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. 2024 సంవత్సరానికి పరిశ్రమలో టాప్ 10 హీరోయిన్లు ఎవరు? వారిలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు? అనేది తెలుసుకుందాం.

సమంత : కొద్ది సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో పాతుకుపోయింది. అక్కినేని నాగార్జునకు మాజీ కోడలు.. అక్కినేని నాగచైతన్యకు మాజీ భార్య. తెలుగు సినీ పరిశ్రమలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. గతేడాది శాకుంతలం సినిమాతో సందడి చేయగా ఈ ఏడాది సినిమాలు రావాల్సి ఉంది. మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్ సినిమాలకు స్వల్ప విరామం ఇచ్చి చికిత్స తీసుకుంది.

top ten heroines in telugu film industry

కాజల్ అగర్వాల్ : హీరోయిన్లకు వివాహమైందంటే వారికి అవకాశాలు కష్టం. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం బిడ్డ పుట్టినప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. భగవంత్ కేసరి చిత్రంతో తన స్టామినా నిరూపించుకుంది. టాప్ టెన్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

top ten heroines in telugu film industry

అనుష్క శెట్టి : గత కొన్నేళ్లుగా పరిశ్రమకు దూరమైనప్పటికీ 2023లో మాత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమెను ఎవరూ మరిచిపోకపోవడంతో మూడోస్థానంలో నిలబడింది.

top ten heroines in telugu film industry

సాయి పల్లవి : గార్గి సినిమాలో నటించిన తర్వాత తెరపై కనపడలేదు. అభిమానుల నుంచి అభిమానాన్ని మాత్రం గట్టిగా సంపాదిస్తోంది. నాగచైతన్యతో తండేల్ సినిమాలో నటిస్తోంది. టాప్ టెన్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.

top ten heroines in telugu film industry

రష్మిక మందన్న : నేషనల్ క్రష్ గా రష్మిక గుర్తింపు తెచ్చుకుంది. పుష్ప, యానిమల్ సినిమాల్లో అద్భుతంగా నటించింది. ప్రేక్షకుల అభిమానంతో పాటు భారీ ఫాలోయింగ్ ఈమె సొంతం. పుష్ప2తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాప్ టెన్ జాబితాలో ఐదోస్థానంలో నిలబడింది. శ్రీలీల ఆరోస్థానంలో, కీర్తి సురేష్ ఏడోస్థానంలో, పూజా హెగ్డే 8వ స్థానంలో, తమన్నా తొమ్మిదో స్థానంలో, అనుపమ పరమేశ్వరన్ పదోస్థానంలో నిలిచారు.

top ten heroines in telugu film industry
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+