నిర్మాతలకు ముందే చెప్పేశారట!: కొంపముంచిన డైరెక్టర్ ఓవర్ కాన్ఫిడెన్స్!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం 'టాక్సిక్' ఇటీవల థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినప్పటికీ.. ఈ సినిమా కథనం, దర్శకత్వంపై విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ 2010లో ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అల్లు అర్జున్ 'రాకా' మూవీలో బిగ్ సర్‌ప్రైజ్!
అల్లు అర్జున్ 'రాకా' మూవీలో బిగ్ సర్‌ప్రైజ్!

2021లో గీతు మోహన్‌దాస్ ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో తన స్క్రిప్ట్ తయారీ, రైటింగ్ ప్రాసెస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "నేను రాసేటప్పుడు ఏ దిశగా వెళ్తున్నానో నాకే తెలియదు. నాకు కథ ప్రారంభం, మధ్య భాగం లేదా ముగింపు అని ముందుగా ఏదీ స్థిరంగా ఉండదు. నా విధానం చాలా భిన్నంగా ఉంటుంది. నేను షూటింగ్ ప్రక్రియ చివర్లోనే ఓ ముగింపుకు వస్తాను" అని ఆ రోజుల్లో గీతు మోహన్‌దాస్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఓ సినిమా రైటింగ్, షూటింగ్‌పై ఆమె మాట్లాడుతూ.. "నేను పేపర్‌పై ఓ రకంగా రాస్తాను. షూటింగ్ చేసేటప్పుడు మరోలా తీస్తాను. ఎడిటంగ్ టేబుల్ వద్ద పూర్తిగా ఇంకో రకంగా మారుస్తాను. నేనెప్పుడూ ఒకే స్క్రిప్ట్ కు కట్టుబడి ఉండను. నన్ను కలిసే నిర్మాతలకు కూడా నేను ముందే చెప్పతాను. మీరు పేపర్‌పై ఏది చదువుతారో.. అది వెండితెరపై కనిపించదు" అని గీతు మోహన్ దాస్ చెప్పారు.

Toxic Movie Director Geethu Mohandas Old Video Viral after the Film Received Mixed Reviews Details

ప్రస్తుతం టాక్సిక్ మూవీ బలహీనమైన కథనం, క్లారిటీ లేని దర్శకత్వం వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుండటంతో నెటిజన్లు ఆమె పాత వీడియోను బయటకు తీసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దర్శకురాలికి సినిమాపై సరైన స్పష్టమైన విజన్ లేకపోవడం వల్లే టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద రెండో రోజు కలెక్షన్లలో పడిపోయిందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

మనుషులు లేని సినిమా! ఏఐ సంచలనం
మనుషులు లేని సినిమా! ఏఐ సంచలనం

అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం గీతు మోహన్ దాస్‌కు మద్దతుగా నిలిచారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖ డైరెక్టర్లు సెట్స్ పైకి వెళ్లాక స్క్రిప్ట్ ను మారుస్తూ ఉంటారని.. ప్రయోగాత్మక ధోరణి ఉన్న డైరెక్టర్లకు ఇలాంటి విధానం సహజమేనని పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల కంటే ఈ డైరెక్టర్ పాత ఇంటర్వ్యూ కామెంట్లే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+