Toxic Movie: టాక్సిక్ మూవీ పబ్లిక్ టాక్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
Toxic Movie: సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన మోస్ట్ అవేటెడ్ సినిమా "టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్".. ఎట్టకేలకు నేడు(ఆగస్టు 26) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకురాలు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. 'కేజీఎఫ్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యశ్.. నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టాక్సిక్ సినిమాతో తెరపైకి కనిపించాడు. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ , హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మించారు.
భారీ అంచనాలతో టాక్సిక్ చిత్రం బుధవారం థియేటర్లలో విడుదల అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో బుక్ మై షోలో గంటకు 50 వేల టికెట్లు అమ్ముడవడమే కాకుండా.. తొలిరోజే 100 కోట్ల వరకు వసూళ్లు సాధించే దిశగా బాక్సాఫీస్ వద్ద ఘనమైన బోణీ కొట్టేలా యశ్ సినిమా ఉంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేలా ప్రత్యేక జీవోలు కూడా జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్ సర్కారు రూ.600 హైక్ తో స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాలతో విడుదల అయిన ఈ సినిమాకు ట్విట్టర్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

"టాక్సిక్" చిత్రంలో యశ్ తండ్రీ కొడుకులుగా డబుల్ రోల్ చేశారు. ఆయన ఇది పెద్దలకు మాత్రమే అని మొదటి నుంచే చెబుతూ రావడంతో పాటు.. దానికి తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కట్ చేయడం గమనార్హం. యాక్షన్, హింసతో పాటుగా రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని ముందుగానే చెప్పారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 3 గంటలకు పైగా రూపొందగా.. 18 ఏళ్లు వయసున్న వారే చూడాలనే షరతుతో 'ఏ' సర్టిఫికేట్ తో విడుదలైంది. ప్రమోషనల్ కంటెంట్ కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించగా.. సినిమాకు మాత్రం మిక్స్డ్ టాక్ లభిస్తోంది.
"టాక్సిక్" స్టోరీ ఏంటి?
ఈ సినిమా స్టోరీ 1950ల నాటి గోవా నేపథ్యం సాగుతూ.. అప్పట్లో పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవాలో సముద్ర మార్గం ద్వారా జరిగే స్మగ్లింగ్, నేర సామ్రాజ్యాలు, గ్యాంగ్ ల మధ్య ఆధిపత్య పోరు చుట్టూ ఈ సినిమా సాగుతుంది. సినిమా విడుదలకు ముందే కొన్ని ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో రివ్యూలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా 3 గంటలకు పైగా రన్ టైమ్, మితిమీరిన హింస, రొమాన్స్, పాత్రల గజిబిజి ఎక్కువగా ఉండటంతో కొంత మంది ప్రేక్షకులకు మైనస్ గా అనిపించినట్లు టాక్ వినిపిస్తోంది. కొందరు ప్రేక్షకులు మాత్రం యష్ కెరీర్ బెస్ట్ అంటూ రివ్యూలు ఇస్తున్నారు.
కొందరు నెటిజన్లు మాత్రం సినిమా దారుణంగా ఉందంటూ రివ్యూలు ఇస్తున్నారు. 'టెక్నికల్ గా చిత్రం చాలా రిచ్ గా ఉన్నప్పటికీ.. గందరగోళంగా ఉన్న స్క్రీన్ ప్లే, బలహీనమైన డైలాగ్స్, ఎడిటింగ్ లోపా వల్ల ఓ పీడకలగా మారింది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం మరింత ఇబ్బందికరంగా అనిపించింది. యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, క్లైమాక్స్ మాత్రమే కాస్త రిలీఫ్' అంటూ ఓ నెటిజన్ పంచుకున్నాడు. ఫస్టాఫ్ చాలా గందరగోళంగా ఉందని ఓ నెటిజన్ పంచుకోగా.. మూడు గంటల సుదీర్ఘమైన టాక్సిక్ నరకాన్ని భరించిన అనంతరం యశ్ కోసమే కాకుండా.. మన సమయం వేస్ట్ అయినందుకు బాధ కలుగుతుందని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
యశ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక్కటే..
టాక్సిక్ చిత్రంలో రాకింగ్ స్టార్ యశ్ తన శక్తినంతా ధారపోసి నటించిన తీరును మాత్రం అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో యశ్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఈ సినిమాకు ప్రధానంగా ప్లస్ పాయింట్ అంటూ ప్రేక్షకులు అంటున్నారు. ఈ చిత్రంలో యశ్ ను కేవలం మాస్ హీరోగా మాత్రమే చూపించకుండా.. అతడి పాత్రలో ఎమోషనల్ షేడ్స్ కూడా బాగున్నాయంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
#Toxic Review: Three Hours of Toxic Torture!
— BINGED (@Binged_) August 26, 2026
BINGED RATING: 1.5/5
By the time #TOXIC ends, if you manage to sit through the entire three-hour runtime, you will not only feel bad for #Yash but also question why you gave this film three hours of your life.
It also makes you…
#ToxicReview
— Thyview (@Thyview) August 26, 2026
In the recent past, we’ve seen so many talented filmmakers tell stories around toxic, problematic protagonists…and audiences have happily turned up for them.
After watching #Toxic, I genuinely felt the director had a much bigger ambition:
Make a film so…
#Toxic - Stylish Yash, Circus Stunt, Rich Visuals r only positives in this 3Hrs lengthy Soulless Violent Action Drama. Improper Character Sketch, Forced adult scenes, Random Seq, Poor Dialogues & No Emotional Connect-Nothing works. Dir Geethu delivers a Mega Boring Film. WORST!
— Christopher Kanagaraj (@Chrissuccess) August 26, 2026
#Toxic A Fairy Tale That Turns Into a Complete Nightmare for Everyone!
— Venky Reviews (@venkyreviews) August 26, 2026
A technically sound film buried under chaotic writing and exhausting execution. There are barely any proper character introductions, the narrative has no clear flow, and the screenplay gets confusing enough…
#ToxicReview:
— Australian Telugu Films (@AuTelugu_Films) August 26, 2026
The first half of Toxic starts with a solid #Yash entry that delivers the expected mass elevation, followed by a few impressive fight episodes. The cinematography, production design and overall setup look good, while #KiaraAdvani and #Nayanthara put in decent… https://t.co/4VMJUvpxEz pic.twitter.com/35yljNiMhu














Click it and Unblock the Notifications