Toxic Movie Review:'టాక్సిక్' మూవీ రివ్యూ.. యాక్షన్ అదిరింది!

Toxic Movie Reviw: కేజీఎఫ్ సిరీస్ వంటి బ్లాక్ బస్టర్ విజయాల అనంతరం రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన 'టాక్సిక్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా వెండితెరపై ఆ స్థాయిలో ఆకట్టుకోవడంలో కాస్త తడబడినా.. యష్ మాత్రం తన నటనతో విశ్వరూపం చూపించాడు. భారీ బడ్జెట్, రిచ్ విజువల్స్ తో ఈ సినిమా నేడు తెరపైకి వచ్చింది. దానికి తోడు నయనతార యష్ సోదరిగా నటించడం, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, కియారా అద్వానీ వంటి స్టార్ కథానాయికలు ఈ సినిమాలో నటించడంతో ఈ చిత్రం ఎలా ఉంటుందా అనే అంచనాలు అందరిలోనూ పెరిగిపోయాయి. మరి కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉంది? యష్ తన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పేరుతో నిర్మాణ భాగస్వామిగా రూపొందించిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ సమీక్షలో తెలుసుకుందాం.

Toxic vs Irumudi: 'టాక్సిక్’ నెగటివ్ టాక్.. రవితేజ 'ఇరుముడి’కి ఊహించని బూస్ట్!
Toxic vs Irumudi: 'టాక్సిక్’ నెగటివ్ టాక్.. రవితేజ 'ఇరుముడి’కి ఊహించని బూస్ట్!

టాక్సిక్ సినిమా స్టోరీ
దేశమంతా స్వాతంత్ర్యం వచ్చినా గోవాలో మాత్రం పోర్చుగీస్ పాలన కొనసాగుతున్న రోజులవి. తన సోదరి గంగ (నయనతార) సాయంతో రాయా (యష్) గోవా మీద పట్టు సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే గోవాని ఏలుతున్న సాల్వడార్ కూతురు రెబెకాతో రాయా పెళ్లికి సిద్ధమవుతాడు. అయితే మరోపక్క అదే ఊరిలో ఓ సర్కస్ కంపెనీ నడిపే నదియా (కియారా అద్వానీ)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే గోవా మొత్తాన్ని ఏలడానికి నదియాను పక్కన పెట్టాలని సోదరి గంగ సూచించడంతో అందుకు కూడా సిద్ధమవుతాడు రాయా. మరి ప్రేమించిన ప్రియురాలికి సైతం దూరమైన రాయ గోవా మీద పట్టు సాధించాడా? అతను మకావు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు రాయా, గంగల కథేమిటి? వీరిద్దరూ కలిసి అసలు ఏం చేయాలనుకున్నారు? చివరికి ఏం జరిగింది? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

Toxic Movie Review Yash Delivers Action shines with mass screen presence in gangster drama

విశ్లేషణ
స్టార్ హీరో యష్ కథానాయకుడిగా 'టాక్సిక్' మూవీ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. అయితే ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ రావడంతో పాటు ప్రమోషన్ కంటెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనన ఆసక్తి ప్రేక్షకుల్లో భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాలో మొదటి సీన్ నుంచే అసలు ఏం జరుగుతుందే విషయం మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. ముందుగా కియారా అద్వానీ (నదియా) పాత్రతో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనే ఆసక్తి పెంచి వెంటనే కథను ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకువెళ్తారు. అసలు ఒత రాయా ప్రస్థానం, రాా ఎవరి కోసం కష్టపడుతున్నాడు, రాయకి కావాల్సిందేంటి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూనే అతనిని ఒక మాన్‌స్టర్‌గా ప్రజెంట్ చేశారు.

అయితే ఎక్కడా కూడా ఈ చిత్రం హై మూమెంట్స్ లేకపోవడం కాస్త ఇబ్బంది కలిగించే అంశం. ఈ సినిమాలో స్క్రీన్ మీద రాకింగ్ స్టార్ యష్ స్టైలిష్ యాక్షన్ అదిరిపోయింది. ఈ చిత్రంలో ఫైట్స్ చాలా బాగా కంపోజ్ చేశారు. కానీ కేజీఎప్ సినిమా ఇచ్చినంత కిగ్ ఈ చిత్రం ఇవ్వలేకపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే కాక కేజీఎఫ్ హ్యాంగోవర్ కూడా ఇందులో ఎక్కువగానే కనిపిస్తుంది. అసలు ఎవరు ఎందుకు ఎవరిని చంపుతున్నారు అనే విషయం మీద ఎన్నో అనుమానాలు కలిగేలా స్టోరీ అనిపిస్తుంది. అయితే సెకండాఫ్ ప్రారంభమయ్యాక ఫస్టాఫ్‌లో వచ్చిన కిక్కు కూడా కాస్త డ్రాప్ అవుతూ వెళ్తుంది. అసలు ఏం జరుగుతోంది, ఎందుకు రాయా ఇలా ప్రవర్తిస్తున్నాడు, అతని కొడుకు పాత్రధారి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అని అనుమానాలు కలిగిస్తూనే ప్రీ క్లైమాక్స్ వరకు తీసుకువెళ్లారు. అంటే స్టోరీలో కాస్త గజిబిజి పాత్రలు ప్రేక్షకులను కాస్త తికమకపెడుతాయి.

Toxic Movie: టాక్సిక్ మూవీ పబ్లిక్ టాక్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
Toxic Movie: టాక్సిక్ మూవీ పబ్లిక్ టాక్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

ప్రీ క్లైమాక్స్ కు వచ్చేసరికి వాళ్లు దాన్ని షాకింగ్ ట్విస్ట్ అనుకున్నారో ఏమో తెలీదు కానీ.. అది పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అక్కడ మొదలుపెట్టిన సైకలాజికల్ డ్రామా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయితే కాలేదు. నిజానికి ఇది షాక్ ఫ్యాక్టర్‌ అని వారు భావించి ఉండవచ్చు, కానీ ఇలాంటి సినిమాలు తెలుగు వారికి కొత్త ఏమీ కాదు. గతంలో ఒకట్రెండు సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్‌తోనే వచ్చాయి. కాకపోతే యష్ స్టైలిష్ యాక్షన్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రమే సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు అని చెప్పక తప్పదు. కథ రొటీన్ అనిపిస్తూనే ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఫీలింగ్ తీసుకొచ్చింది. అయితే ఎక్కడా ఎమోషన్ ఎస్టాబ్లిష్ కాకపోవడం కొంత ఇబ్బంది కలిగించే అంశమే. యష్ సోదరిగా నయనతార పాత్ర పరిమితమే. అన్నాచెల్లెళ్ల మధ్య ఎమోషన్‌ను బిల్డ్ చేయడంలో టీం పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. సెకండాఫ్ లో పరిస్థితి మరింత నీరసించింది. రుక్మిణి వసంత్ ఎంట్రీ, అలాగే నీటిలో సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు పాతకాలపు సినిమాలను గుర్తు చేస్తూ కాస్త బోర్ కొట్టిస్తాయి. చివరలో వచ్చే సైకలాజికల్ ట్విస్ట్ ఉన్నప్పటికీ.. అప్పటికే కన్ఫ్యూజింగ్ గేమ్ లా మారిన కథనానికి ఆ ట్విస్ట్ ఏ మాత్రం సహాయపడదు. దాదాపు 3 గంటల నిడివి విషయం కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది.

నటీనటులు ఎవరెలా చేశారంటే?
యష్ తన రాయా పాత్రలో మాస్ ప్రెజెన్స్ తో మెప్పించినప్పటికీ.. ఆయన ఇంకా కేజీఎఫ్ హ్యాంగోవర్లోనే ఉన్నట్లు అనిపించింది. ఆయన బాడీ లాంగ్వేజ్, లుక్స్ దాన్ని గుర్తు చేస్తాయి. అయితే తెలుగు డబ్బింగ్ చెప్పిన తీరు కూడా కాస్త డల్ అనిపిస్తుంది. నయనతార పాత్ర పరిమితమే అయినా.. కనిపించిన కొద్దిసేపు ఆకట్టుకుంది. కియారా అద్వానీ గ్లామర్ తో పాటు నటనతో మెప్పించే ప్రయత్నం చేసింది. ఓ పక్క అందాలు ఆరబోస్తూనే మరోపక్క అభినయంతోనూ ఆకట్టుకుంది. తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ వంటి ఇతర నటీనటులు పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం
సాంకేతికంగా రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అతిపెద్ద అసెట్. ప్రతి ఫ్రేమ్ ను చాలా రిచ్ గా, గ్రాండ్ గా చూపించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు కూడా హాలీవుడ్ ప్రమణాలకు తగ్గట్టుగా ఉన్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీతో పాటు ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి కరెక్ట్‌గా సరిపోయింది. ఎక్కడా ఒక్క నార్మల్ లొకేషన్ కూడా లేదు. అయితే భారీ వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉన్నాయి, లేదా ఒక లగ్జరీ సెట్‌లో ప్లాన్ చేశారు. నార్మల్ సీన్ ఒక్కటి కూడా అవుట్‌డోర్‌లో లేదు అంటే ఆశ్చర్యం కలగక మానదు. పాటలు బాగున్నాయి, నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు కానీ ఇంకాస్త బెటర్‌గా చేసి ఉండొచ్చు. నిడివి విషయంలో కేర్ తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ కొంతవరకు మెరుగ్గా ఉండేది.ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉంటే బాగుండేది. నిడివి ఎక్కువగా ఉండటం చిత్రానికి మైనస్ గా మారింది.

ఫైనల్‌గా..
ఈ సినిమా.. మితిమీరిన వయోలెన్స్ ఇష్టపడే వారికి మాత్రమే!

రేటింగ్: 2.75/5.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+