డిజాస్టర్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లు నీకే సాధ్యం అన్నా..!
కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో రాకింగ్ స్టార్ యష్. నాలుగేళ్ల విరామం తర్వాత చేసిన సినిమా 'టాక్సిక్' ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26 న విడుదల అయింది. కేజీఎఫ్ 2 తర్వాత నాలుగేళ్ల విరామం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాకు విపరీతమైన హైప్ ఏర్పడింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఫస్ట్ డే రోజే బుక్ మై షో, ఇతర యాప్స్ ద్వారా దాదాపు 15 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దాంతో ఈ సినిమా స్టామినా ఏంటో బాక్సాఫీస్ వద్ద అర్థమైంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా టాక్సిక్ మూవీకి రూ. 120 కోట్ల వసూల్లు వచ్చాయి. భారత్ లో రూ.101.10 కోట్ల వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇక యష్ టాక్సిక్ మూవీ నార్త్ లో దుమ్ములేపుతోంది. హిందీ బెల్ట్ లో ఈ మూవీకి ఫస్ట్ డే న రూ. 57 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ మేరకు నార్త్ ఇండియాలో కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డుల్ని ఈ మూవీ బద్దలు కొట్టింది. ఫస్ట్ డే కలెక్షన్స్ లో నార్త్ బెల్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 తర్వాతి స్థానంలో టాక్సిక్ నిలిచింది. ఇక కన్నడలో టాక్సిక్ మూవీకి రూ. 23.30 కోట్లు వచ్చినట్లు సమాచారం. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి డీసెంట్ గానే కలెక్షన్స్ వచ్చాయి. తెలుగులో టాక్సిక్ మూవీ తొలిరోజు రూ. 16 కోట్లను రాబట్టింది. అదే తమిళనాడులో రూ. 5.50 కోట్లు, మలయాళంలో రూ. 1.30 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సత్తా చాటింది. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా లాంగ్ వీకెండ్ నేపథ్యంలో కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. వీకెండ్ పూర్తి చేసుకుని సోమవారం నాటికి టాక్సిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద మరిన్ని కొత్త మైలురాళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

సాక్ నిల్క్ అందించిన నివేదికల ప్రకారం.. టాక్సిక్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో 24,579 స్క్రీన్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ మేరకు 56.1 శాతం మేర థియేటర్ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఇక టాక్సిక్ మూవీలో యష్ వన్ మ్యాన్ షోలో అలరించారు. రాయ, టికెట్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో మెరిశారు. స్టైలిష్ లుక్, యాక్షన్ సీక్వెన్స్ లో యష్ అదరగొట్టారు. అలాగే గంగ క్యారెక్టర్ చేసిన లేడీ సూపర్ స్టార్ నయనతార, నదియా పాత్ర చేసిన కియారా అడ్వాణీలు సినిమాకు ప్లస్ పాయింట్ అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.












Click it and Unblock the Notifications