Toxic: 'టాక్సిక్' మూవీపై RGV రివ్యూ: ఒక్క ముక్కలో తేల్చేశాడుగా..!
రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' మూవీపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్నారు యష్. అయితే కేజీఎఫ్ 2 రిలీజ్ అయ్యాక నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ 'టాక్సిక్' కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు ఆ అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే భారీ అంచనాల మధ్య ఆగస్టు 26న విడుదలైంది ఈ మూవీ. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో యశ్ కేవలం హీరోగానే కాకుండా, రచయితగా, నిర్మాతగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
Now watching #Dhurandhar again .
— Ram Gopal Varma (@RGVzoomin) August 26, 2026
ఇక మూవీకి ప్లాఫ్ టాక్ వస్తోంది. టాక్సిక్ మూవీ కథ, స్క్రీన్ ప్లే విషయంలో దర్శకురాలు తడబడినట్లు స్పష్టం అవుతోంది. అలాగే భారీ రన్ టైమ్ కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ అని తెలుస్తోంది. ప్రేక్షకుల్ని తికమక పెట్టే స్క్రీన్ ప్లే తో పాటు బలమైన ఎమోషనల్ కనెక్ట్ లోపించడం ఈ మూవీ ప్లాఫ్ కు కారణంగా తెలుస్తోంది. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. రాయ - నదియా క్యారెక్టర్స్ మధ్య లవ్ సీక్వెన్స్ లు, రెండు విభిన్న పాత్రల్లో యష్ నటన, అంతర్జాతీయ రేంజ్ లో విజువల్స్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. అలాగే తారా సుతారియా, హ్యూమా ఖురేషీ పాత్రలూ ఆకట్టుకుంటాయి. సాంకేతిక విభాగాల్లో రాజీవ్ రవి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడకక్కడా ప్రభావం చూపింది. మొత్తానికి గీతూ మోహన్ దాస్ దర్శకురాలిగా విఫలమయ్యారనే చెప్పాలి. టాక్సిక్ లో స్టోరీ కంటే హింసే ఎక్కువగా ఉందని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.

అయితే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా టాక్సిక్ మూవీపై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో ఓ పోస్టు పెట్టారు. అయితే టాక్సిక్ అనే పేరు రాకుండా ఆయన సెటైరికల్ గా ట్వీట్ చేశారు. "నౌ వాచింగ్ ధురంధర్ ఎగైన్" అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. టాక్సిక్ నచ్చలేదు అని చెప్పకుండా ఈ ఏడాది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధురంధర్ మూవీని మరోసారి చూస్తున్నా అంటూ ఆయన ట్వీట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications