అప్పుడే ఓటీటీలోకి 'టాక్సిక్' మూవీ.. ఎందులో చూడాలంటే..?
రాకింగ్ స్టార్ యశ్ కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్నారు. యశ్ అంటే కేజీఎఫ్ కు ముందు.. ఆ తర్వాత అని స్పష్టమైంది. అయితే ఈ మూవీ తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం టాక్సిక్. కేజీఎఫ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే చిత్ర యూనిట్ బీభత్సంగా ప్రొమోషన్స్ ను చేసింది.
హైదరాబాద్, చెన్నై నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను ఏర్పాటు చేసింది. దాంతో రిలీజ్ కు ముందు టాక్సిక్ మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ డే ఈ మూవీకి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్లపై ఆ ప్రభావం పడలేదు. టాక్సిక్' మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లను వసూళ్లను సాధించింది. దేశీయంగా చూసుకుంటే రూ.101.10 కోట్ల వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే రెండో రోజు నుంచి సీన్ రివర్స్ అయింది. టాక్సిక్ మూవీకి డిజాస్టర్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా తగ్గాయి. రెండో రోజు కేవలం రూ.37.65 కోట్లకు మాత్రమే టాక్సిక్ మూవీ పరిమితమైంది. ఇక ట్రేడ్ అంచనాల ప్రకారం టాక్సిక్ మూవీ మూడో రోజు ఇండియాలో రూ. 26.60 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. దేశవ్యాప్తంగా 19,390 షోలు పడ్డాయి. టోటల్ ఆక్యుపెన్సీ 25.5 శాతంగా నమోదైంది. అంటే రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు వసూళ్లు 29.3 శాతం మేర తగ్గాయి.
ఇక టాక్సిక్ మూవీకి మొత్తం మూడు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్లు మాత్రం రూ. 165.35 కోట్లకు చేరాయి. అలాగే భారత్ లో గ్రాస్ రూ. 197.70 కోట్లుగా నమోదైంది. అటు ఓవర్సీస్ విషయానికి వస్తే మూడో రోజు ఈ సినిమా రూ. 4 కోట్ల మేర గ్రాస్ వసూలు చేయగా.. మూడు రోజుల మొత్తం ఓవర్సీస్ కలెక్షన్లు రూ. 23.75 కోట్లకు చేరాయి. దీంతో టాక్సిక్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 221.45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

అయితే టాక్సిక్ మూవీ పెద్ద ఫ్లాప్ అయింది కాబట్టి.. ఓటీటీలోకి కూడా అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ లెక్కన సెప్టెంబర్ 3వ వారం లోనే ఈ చిత్రాన్ని జీ 5 లో చూడొచ్చు. ఇక టాక్సిక్ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 4 వారాల్లోనే ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే హిందీ వెర్షన్ ను మాత్రం కచ్చితంగా 8 వారాల తర్వాత మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications