105 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ‘టాక్సిక్’ సరికొత్త చెత్త రికార్డు
భారీ అంచనాల నడుమ విడుదలైన కన్నడ పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. 'కేజీఎఫ్' వంటి అఖండ విజయం తర్వాత యష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, ఆ అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది. సినిమా విడుదలైన నాటి నుంచి సోషల్ మీడియాలోనూ, ప్రేక్షకుల నుంచి భారీ ట్రోల్స్‌ను ఎదుర్కొని ఊహించని డిజాస్టర్‌గా నిలిచింది.
తెలుగు నాట ఆల్-టైమ్ డిజాస్టర్ రికార్డు
తెలుగు సినిమా 105 ఏళ్ల చరిత్రలో ఏ చిత్రానికి రానటువంటి భారీ నష్టాలను 'టాక్సిక్' మూటగట్టుకుంది. ఇప్పటివరకు తెలుగు తెరపై పెద్ద హీరోల సినిమాలైన 'రాధేశ్యామ్', 'అజ్ఞాతవాసి', 'ఆచార్య', 'గేమ్ ఛేంజర్' వంటి చిత్రాలు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయని వార్తలు వచ్చినా, వాటన్నింటినీ వెనక్కి నెట్టి 'టాక్సిక్' సరికొత్త చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

రూ.109 కోట్ల బిజినెస్
ఒక కన్నడ డబ్బింగ్ సినిమాకు తెలుగులో అపూర్వంగా రూ.109 కోట్ల భారీ బిజినెస్ జరగడం విశేషం. అయితే రూ.110 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.19 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టగలిగింది. దీంతో తెలుగు మార్కెట్‌లో ఈ సినిమా ఏకంగా రూ.91 కోట్ల నష్టాలను మిగిల్చి, టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక నష్టాలు చవిచూసిన చిత్రంగా నిలిచింది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్స్ బ్యానర్లపై వెంకట్ కే. నారాయణ, యష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఓటీటీలోకి రాబోతున్న 'టాక్సిక్'
థియేట్రికల్ రన్ పరంగా తీవ్ర నిరాశపరిచిన ఈ చిత్రం, ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్ విషయమై వార్తల్లో నిలిచింది. సినిమా విడుదలకు ముందు భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ మేకర్స్ వెనకాడగా, ఇప్పుడు డిజాస్టర్ టాక్ రావడంతో తక్కువ ధరకే డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ 'జీ5' దక్కించుకుంది. సెప్టెంబర్ 25 నుంచి తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.














Click it and Unblock the Notifications
