ఫస్ట్ మూవీకి ముందే పాన్ ఇండియా ఛాన్స్.. రాకీ భాయ్‌తో టాలీవుడ్ డైరెక్టర్!

ప్రస్తుతం సినీ వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. మంచు మనోజ్ కథానాయకుడిగా 'డేవిడ్ రెడ్డి' అనే పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్న దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి.. తన మొదటి సినిమా విడుదల కాకముందే మరో భారీ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రాకీ భాయ్, పాన్-ఇండియా స్టార్ యష్ తో హనుమ రెడ్డి తన తదుపరి సినిమా చేయబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

ఊహించని క్లైమాక్స్‌తో అదరగొట్టిన చిన్న సినిమా!
ఊహించని క్లైమాక్స్‌తో అదరగొట్టిన చిన్న సినిమా!

ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
పాన్-ఇండియా స్టార్ యష్‌తో ఓ కొత్త దర్శకుడి కాంబినేషన్ అనగానే అభిమానులతో పాటు సినీ ప్రేమికులందరి దృష్టి ఒక్కసారిగా ఈ ప్రాజెక్టు వైపు మళ్లింది. 1897 నుంచి 1922 మధ్య సాగే బ్రిటీష్ కాలం నాటి పీరియాడిక్ కథాంశంతో 'డేవిడ్ రెడ్డి'ని భారీ స్థాయిలో రూపొందిస్తున్న తీరు చూసి యష్‌తో హనుమ రెడ్డి సినిమా తీస్తే ఏ రేంజ్‌లో ఉంటుందోనని చర్చలు మొదలయ్యాయి. 'టాక్సిక్' సినిమా తర్వాత యష్ ఏ దర్శకుడితో కలిసి పనిచేస్తారనే ఉత్కంఠ నేపథ్యంలో హనుమ రెడ్డి పేరు తెరపైకి రావడం గమనార్హం.

Toxic star Yash and Hanuma Reddy Pan-India Movie Rumors David Reddy Director Next Film Details

అధికారిక ప్రకటన ఇంకా రాలేదు..
ఈ వార్త నెట్టింట భారీగా వైరల్ అవుతున్నప్పటికీ.. దీనిపై నటుడు యష్ నుంచి కానీ లేదా డైరెక్టర్ హనుమ రెడ్డి నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 'డేవిడ్ రెడ్డి' టీజర్.. అందులోని విజువల్స్, బిగ్ స్కేల్ ప్రొడక్షణ్ చూసి ఇండస్ట్రీలో మొదలైన సాధారణ గాసిప్ కావచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ వార్తల్లో నిజమెంతో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

 Hanuman Ansh Movie Review:'హనుమాన్ అంశ్' సినిమా రివ్యూ
Hanuman Ansh Movie Review:'హనుమాన్ అంశ్' సినిమా రివ్యూ

మొదటి సినిమాకే టాప్ టెక్నీషియన్లు
హనుమ రెడ్డి యక్కంటి 'డేవిడ్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో బలమైన ఇంపాక్ట్ చూపించడానికి సిద్ధమవుతున్నారు. మొదటి సినిమాకే రవి బస్రూర్ సంగీతం, ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ, సుప్రీమ్ సుందర్ స్టంట్ మాస్టర్ గా వంటి టాప్ టెక్నీషియన్లను ఎంచుకుని భారీ స్కేల్ లో పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే యష్ లాంటి పాన్-ఇండియా స్టార్ తో తదుపరి సినిమా అంటూ ప్రచారం జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+