Toxic vs Irumudi: ‘టాక్సిక్’ నెగటివ్ టాక్.. రవితేజ ‘ఇరుముడి’కి ఊహించని బూస్ట్!

Toxic vs Irumudi: బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతకాలు ఎప్పుడెలా మారతాయో చెప్పడం చాలా కష్టం. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' చిత్రానికి ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, ప్రేక్షకుల్లోనూ నెగటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామం మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమాకు ఊహించని ప్లస్ పాయింట్ గా మారబోతోందని సినిమా ఇండస్ట్రీలోనూ, నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇరుముడికి థియేటర్ల సంఖ్య పెరిగే చాన్స్
పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న యశ్ సినిమా విడుదలవుతుండటంతో సహజంగానే 'ఇరుముడి' సినిమాకు కేటాయించిన థియేటర్ల సంఖ్య తగ్గింది. అయితే ఇప్పుడు 'టాక్సిక్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో ప్రేక్షకులు మళ్లీ పాజిటివ్ టాక్‌తో నడుస్తున్న 'ఇరుముడి' వైపు చూసే అవకాశం ఏర్పడింది. దీంతో డిమాండ్‌కు తగినట్లుగా ఎగ్జిబిటర్లు రవితేజ సినిమాకు థియేటర్ల సంఖ్యను, షోలను మళ్లీ పెంచే యోచనలో ఉన్నారు.

Toxic vs Irumudi Ravi Teja Movie Gains Momentum Amid Negative Word-of-Mouth for Yash Starrer

రూ.100 కోట్లతో 'ఇరుముడి' రికార్డు కలెక్షన్లు
మరోవైపు మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' సినిమా తొలి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కథలోని మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విశేషం ఆకట్టుకోవడమే ఈ స్థాయి వసూళ్లకు కారణమైంది.

వీకెండ్స్ లాభం పొందేందుకు సిద్ధం
ప్రస్తుతం వరుసగా పండగలు, వారాంతపు సెలవులు వస్తుండటం 'ఇరుముడి' సినిమాకు మరింత పెద్ద వరంలా మారనుంది. భారీ పోటీగా భావించిన 'టాక్సిక్' రేసులో కాస్త వెనుకబడటంతో ఈ లాంగ్ హాలిడే సీజన్ పూర్తి అడ్వాంటేజ్ రవితేజ ఖాతాలోనే పడనుంది. థియేటర్లు కూడా పెరిగితే రాబోయే రోజుల్లో 'ఇరుముడి'బాక్సాఫీస్ వసూళ్లు మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+