Toxic First Review: టాక్సిక్ మూవీ ఫస్ట్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?

కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో యష్. రెండు సినిమాలతోనే పాన్ ఇండియా రేంజ్ లో కోట్లమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అయితే కేజీఎఫ్ 2 అనంతరం నాలుగేళ్ల విరామం తర్వాత యష్ చేసిన చిత్రం 'టాక్సిక్'.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26 న విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఘనంగా ప్రీ- రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ ఈవెంట్ సూపర్ బ్లాక్ బస్టర్ అయింది. దాదాపు 75 వేల మందికి పైగా విద్యార్థుల మధ్య టాక్సిక్ టీమ్ సందడి చేసింది. ఇక టాక్సిక్ మూవీ బుకింగ్స్ ఇప్పటికే నార్త్ లో ప్రారంభం అయ్యాయి. ఏపీ, తెలంగాణలో ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మూవీ కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది.

టాక్సిక్ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. దాంతో పెద్దలకు మాత్రమే ఈ మూవీ ప్రదర్శితం కానుంది. అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్లు ఈ సినిమాను చూసేందుకు అనర్హులుగా సెన్సార్ బృందం ప్రకటించింది. సినిమా రన్ టైమ్ దాదాపు 3 గంటల 15 నిమిషాలుగా ఉంది.

యాక్షన్ అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మానస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌ పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా నిర్మించారు. ఈ చిత్రంలో హీరో యష్ సరసన కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించారు. భారీ తారాగణం మధ్య ఈ మూవీ విజువల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించేందుకు సిద్దం అవుతోంది.

ఈ మూవీ ఫస్ట్ రివ్యూ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న రివ్యూ ప్రకారం టాక్సిక్ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినా గోవా రాష్ట్రానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. చాలా కాలం పాటు ఆ ప్రాంతం పోర్చుగీస్ ప్రభుత్వం అధీనంలోనే ఉంది. పోర్చుగీస్ వాళ్లు మొదట గోవాలోనే అడుగుపెట్టారు. చివరగా గోవాను విడిచే వెళ్లారు. అందుకే ఇప్పటికీ అక్కడ వెస్ట్రన్ కల్చర్ పాపులర్ గా ఉంటుంది. అయితే ఈ రాష్ట్రంలో పవర్ పాలిటిక్స్, వెన్నుపోట్లు, డ్రగ్స్, మాఫియా యదేచ్ఛగా కొనసాగుతూ ఉండేవి. హింస, రక్తపాతం, మోసం, దగా ఇలా అన్నీ ఈ ప్రాంతంలో జరిగేవి.

Toxic Yash movie The first review of Rocking Star Yash movie Toxic is out is it a hit or a flop

అయితే ఇలా ఉన్న ప్రాంతాన్ని రాయ (యష్) ఎలా ఎదుర్కొన్నారు..? రాయను ఆయన చెల్లెలు గంగ(నయనతార) ఎందుకు అంతలా వ్యతిరేకించింది..? నదియా(కియారా అద్వానీ) తో రాయ లవ్ జర్నీ ఏంటి..? ఇక రెబెకా(తారా సుతారియా), మెలిసా (రుక్మిణి వసంత్) అలాగే ఎలిజెబెత్ (హ్యుమా ఖురేషి) పాత్రలు ఏంటి..? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. ఈ మూవీలో యష్ డ్యూయర్ రూల్ లో నటిస్తున్నారు. దాంతో ఈ మూవీలో అంచనాలు భారీగా పెరిగాయి. రాయ, రుమీ అనే రెండు పాత్రల్లో యష్ నట విశ్వరూపం చూపించినట్లు తెలుస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూర్తి రివ్యూ కోసం ఆగస్టు 26 వరకూ ఆగాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+