హాలీవుడ్‌లో విషాదం..టార్జాన్ హీరో రాన్ ఎలీ కన్నుమూత..
హాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ టీవీ సిరీస్ టార్జాన్ హీరో రాన్ ఎలీ మృతిచెందారు. టార్జన్ టీవీ సీరిస్ ఒక్క హాలీవుడ్‌లోనే కాకుండా సినీ ప్రేమికులందరికీ ఎంతో పరిచయం. ఇక్కడి ప్రేక్షకులను కూడా ఎంతో బాగా ఆకట్టుకుంది. 86 ఏళ్ల వయస్సులో రాన్ ఏలీ మృతిచెందారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కూతురు కిర్‌స్టెన్ ఎలీ సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే, ఆయన ఎప్పుడు, ఎలా చనిపోయారనే విషయాన్ని మాత్రం తెలపలేదు. టార్జాన్లో టీవీ సిరిస్‌లోని ఆ పాత్రకు రాన్ ఎలీకీ మంచి పేరొచ్చింది.
తన తండ్రి మరణవార్తను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. నేను నా తండ్రిని కోల్పోయాను. ఆయన్ను అందరూ హీరో అని పిలుస్తుంటారు. ఆయన కేవలం నటుడిగానే కాకుండాచ రచయితగా, కోచ్‌గా, గురువుగా, కుటుంబ వ్యక్తిగా, నాయకుడిగా రాణించిన వ్యక్తి. ఆయన ప్రభావం ఇతరులపై ఎప్పుడూ ఉండేది.

నాన్నే నా ప్రపంచం. నా రోల్ మోడల్ కూడా నాన్నే. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు అంటూ ఆమె రాసుకొచ్చారు. ఆయన మరణవార్త గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేశారు. రాన్ ఎలీ మరణం హాలీవుడ్ సినీ పరిశ్రమకు తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications