వ్యభిచారంలోకి రజనీకాంత్ హీరోయిన్
సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. అయితే కొందరి హీరోల కారణంగా హీరోయిన్లు జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పుడు అయితే కాస్టింగ్ కౌచ్ అంటూ హీరోయిన్లు బయటకు వచ్చి తమకు జరిగిన వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నారు.
గతంలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ వ్యభిచారంలోకి అడుగుపెట్టి కెరీర్‌ను తన చేతులారా పాడు చేసుకుంది. సినిమా పరిశ్రమలో జీవితాన్ని నాశనం చేసుకున్న వారిలో గ్లామర్ డాల్ నిషా నూర్ ఒకరు. తమిళనాడులోని నాగపట్నంకు చెందిన నిషా నూర్.. 80ల్లో తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పట్లో నిషా నూర్ తమిళంలో పాపులర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1990ల్లోనే నిషా నూర్ బికిని వేసి సంచలనం సృష్టించింది. నిషా నూర్ తన గ్లామర్, బోల్డ్ పాత్రలతో బాగా క్రేజ్ తెచ్చుకుంది.

కమల్ హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలతో నటించిన నిషా నూర్ .. కె.బాలచందర్, భారతీరాజా లాంటి దిగ్గజ దర్శకులతో పనిచేశారు. అయితే సినిమాలు తగ్గుతున్న సమయంలో ఓ దర్శకుడును నమ్మి మోసపోయింది. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానంటూ నిషా నూర్‌ను నమ్మించిన నిర్మాత ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టేశాడు. కష్టపడి సంపాదించిన డబ్బును పొగొట్టుకోవడంతో నిషా ఇలా వ్యభిచారంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. అటు సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో నిషా నూర్ వ్యభిచార వృత్తిని కొనసాగించింది.
కష్టకాలంలో ఆమెకు తన కుటుంబం నుండి ఎటువంటి మద్దతు లభించలేదు. నిషా నూర్ ఓ దర్గా బయట వీధిలో నిద్రపోయే పరిస్థితి వచ్చిందంటే.. ఆమె జీవితం ఎంత దారుణంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఓ ఎన్జీఓ సంస్థ నిషా నూర్‌ను గుర్తించింది. బక్కచిక్కి గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది. హాస్పిటల్‌లో టెస్టులు చేయించగా నిషా నూర్ ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. నిషా నూర్.. 2007లో 44 ఏళ్ల వయస్సులో ఎయిడ్స్‌తో పోరాడుతూ మరణించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications