పండక్కి మరో కొత్త సినిమా రిలీజ్.. ట్రైలర్ వచ్చేసింది..

టాలీవుడ్ హీరో శర్వానంద్, సంయుక్తా మేనన్, సాక్షి వైద్య కాంబోలో తెరకెక్కిన నారీనారీ నడుమ మురారి సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 14 న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో సత్య, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర అనీల్ సుంక‌ర నిర్మించారు.

ఈ ఏడాది సంక్రాంతికి చాలా సినిమాలే రిలీజ్ కు సిద్ధం అయ్యాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ ఇప్పటికే థియేటర్ల వద్ద సందడి చేస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి మనశంకర వర ప్రసాద్ గారు మూవీ జనవరి 12న విడుదలకు సిద్ధం అయింది. అలాగే మాస్ మహారాజ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ జనవరి 13 న రిలీజ్ కానుంది. ఆ తర్వాత జనవరి 14 న నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఇప్పుడు శర్వానంద్ మూవీ కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 14 న సాయంత్రం ఆట నుంచి ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్.

Trailer Out Now Sharwanand s Nari Nari Naduma Murari Promises Non-Stop Comedy for Sankranthi

గతంలో శర్వానంద్ న‌టించిన ర‌న్ రాజా ర‌న్‌, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాలు జ‌న‌వ‌రి 14 నే విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడ‌దే సెంటిమెంట్‌ తో నారీనారీ నడుమ మురారి సినిమా రిలీజ్ అవుతుంది. దాంతో ఈ సారి కూడా శర్వానంద్ హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ మూవీని రామ్ అబ్బరాజు తెరకెక్కించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతాన్ని అందించారు. మరి ఈ సంక్రాంతికి ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి. ఈ చిత్రానికి జ్ఞానశేఖర్, యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక మాజీ ప్రేయసి, ప్రజెంట్ లవర్ మధ్య నలిగిపోయే క్యారెక్టర్ గా శర్వానంద్ పాత్ర కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+