షాకిచ్చిన నేషనల్ క్రష్ ..పెళ్లి కాకుండానే బిడ్డతో దర్శనం
ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది త్రిప్తి డిమ్రీ. రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ మారిపోయింది. యానిమల్ సినిమాలో త్రిప్తి డిమ్రీ గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. అందం, అభినయం, గ్లామర్‌తో కట్టిపడేసింది.యానిమల్ సినిమా కన్నా ముందే పలు సినిమాల్లో నటించినప్పటికి రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో వచ్చిందనే చెప్పాలి.
ఈ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. యానిమల్ సినిమా బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో త్రిప్తికి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. అలాగే ఇటు తెలుగులో భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయనుందనే టాక్ కూడా వినిపిస్తుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు. త్రిప్తి డిమ్రి ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మామ్, పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను వంటి చిత్రాల్లో నటించింది. కానీ బుల్ బుల్ చిత్రంతోనే ఫేమస్ అయ్యింది.

ఇక యానిమల్ సినిమా పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం విక్కీ విద్య కా వో వాలా వీడియో, భుల్ భూలయా 3, బ్యాడ్ న్యూస్, దఢక్ 2లో నటిస్తుంది. ఇదిలా ఉంటే త్రిప్తి డిమ్రీ తన సోషల్ మీడియాలో ఓ బిడ్డతో కనిపించి అందరికి షాకిచ్చింది. నా కిమ్చి అనే క్యాప్షన్‌ను తన ఆ ఫొటోకు జత చేసింది. అయితే ఆ పాప ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. ఇది చూసిన నెటిజన్లు ఇలియానా మాదిరిగా పెళ్లి కాకుండా బిడ్డతో దర్శనమిచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications