నయనతారను తీవ్రంగా హెచ్చరించిన త్రిష

తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు నయనతార, త్రిష. 40 సంవత్సరాల వయసు పైనబడినప్పటికీ ఇప్పటికీ త్రిష ఎంతో అందంగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరచడమేకాదు.. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ అగ్ర కథానాయికగా రాణిస్తోంది. అలాగే నయనతారను ఆమె అభిమానులు లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. ఈమెకు అహంకారం ఎక్కువ.. ఎవరినీ లెక్కచేయదు.. అంటూ వార్తలు వస్తుంటాయి. సినిమా చేయడం వరకే ఆమె పని. తర్వాత ప్రమోషన్స్ లో కూడా పాల్గొనదు. త్రిష, నయనతార మధ్య ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా అజిత్ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం అజిత్ అభిమానులకు మంచి విందు భోజనాన్ని అందించిందని చెప్పొచ్చు.

ఇంతవరకు కనీసం డబ్బింగ్ కూడా చెప్పుకోలేదు
ఈ సినిమాకు మినిమం కలెక్షన్లు వస్తున్నాయి. సినిమాలో త్రిష బాగా చేసిందని, ఆమె నటన బాగుందంటూ త్రిష అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. లేడీ సూపర్ స్టార్ అంటే ఒక్క త్రిష మాత్రమేనని అంటున్నారు. దీనిపై నయనతార అభిమానులకు కోపం వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్నప్పటికీ కనీసం డబ్బింగ్ చెప్పడం కూడా రాదని, వేరేవారిపై ఆధారపడుతుందని, ఆమె నటన కూడా బాగోదంటూ నయనతార అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ గొడవపై త్రిషకు కోపం వచ్చింది. నయనతార అభిమానులను లక్ష్యంగా పెట్టుకొని ఓ పోస్ట్ చేసింది. అందులో ఏముందంటే..

Trisha gives a stern warning to Nayanthara

మీకు అసలు నిద్ర పడుతుందా?
ఛీ.. టాక్సిక్ మనుషుల్లారా? మీకు అసలు నిద్ర పడుతుందా? ఎదుటివారి గురించి వ్యతిరేకంగా మాట్లాడటమే మీ పనా? తెలివి తక్కువతనంగా వ్యవహరిస్తున్నారని, ఇతరుల విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నరాని, మీతో కలిసి జీవిస్తున్నవారి విషయంలో తాను ఎంతో బాధకు గురవుతున్నానంటూ పోస్ట్ లో పేర్కొంది. ఇది పిరికితనం కిందకు వస్తుందని, గాడ్ బ్లెస్ యూ అంటూ నెగెటివ్ కామెంట్లు పెడుతున్నవారికి ధీటుగా బదులిచ్చింది. అయితే టాక్సిక్ అనే సినిమాలో నయనతార నటిస్తోంది. యష్ హీరో. టాక్సిక్ అనే పదాన్ని త్రిష పోస్ట్ లో చేర్చడంద్వారా నయనతారను, ఆమె అభిమానులను విమర్శించేందుకే ఈ పోస్ట్ పెట్టిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకరకంగా నయనతారకు త్రిష నుంచి వచ్చిన తీవ్ర హెచ్చరికలాంటిదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+