హీరో విజయ్‌ను గుడ్డిగా నమ్మాను - త్రిష
గత కొద్దిరోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించి అనేక కథనాలు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. విజయ్ పుట్టిన రోజు నాడు త్రిష అతనికి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ పాటను కూడా యాడ్ చేసి మరీ షేర్ చేయడంతో అది నెట్టింట వైరల్‌గా మారింది. ఈక్రమంలోనే త్రిష ప్రత్యేకంగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రైవేట్ ఫొటో లీక్ చేసిన విషయం తెలిసిందే.
పైగా విజయ్ ఇచ్చిన బర్త్ డే పార్టీకి త్రిష కూడా వచ్చారని టాక్ వినిపించింది. ఆ సమయంలో ఆమెకు ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చాడట విజయ్. కోటి రూపాయల విలువ చేసే డైమండ్ నెక్లెస్‌ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక విజయ్ కోసమే ఆమె ఓ ఐటం సాంగ్‌లో కూడా నటించారు. విజయ్ కోసమని కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఐటం సాంగ్‌లో నటించారామె. తొలుత ఈ సాంగ్‌లో హీరోయిన్ శ్రీలీలను అనుకున్నారు. కానీ సడన్‌గా శ్రీలీల స్థానంలో త్రిష ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాలో త్రిష, విజయ్ సాంగ్‌పై ఘోరంగా ట్రోల్స్ నడిచాయి. విజువల్‌గా కూడా ఈ సాంగ్ వరస్ట్‌గా ఉందని సినీ అభిమానులు పెదవి విరిచారు.

అసలు త్రిష ఎందుకు ఈ ఐటం సాంగ్‌లో నటించారని ఆమె అభిమానులు ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే త్రిష ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ విజయ్ పేరును ప్రస్తావించారు. విజయ్‌తో ఓ సినిమాలో నటిస్తోన్న సమయంలో ఫైటింగ్ సీన్ చేయాల్సి వచ్చిందని, అప్పటికే నా నడుముకు రోప్ కట్టారని, అయినప్పకీ చాలా భయం వేసిందని, దీంతో ఏం చేయాలో తెలియక విజయ్‌ను గుడ్డిగా నమ్మి అతనితో పాటు పైనుంచి దూకేశానని త్రిష చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక త్రిష కెరీర్ విషయానికి వస్తే.. లియో సినిమా సక్సెస్‌తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీ మారారు త్రిష. త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే..ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంటోంది. తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి.












Click it and Unblock the Notifications