Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

త్రిషతో బెడ్‌రూమ్‌ పంచుకుందామనుకున్నా - నటుడి వ్యాఖ్యల కలకలం..!!

ప్రముఖ నటి త్రిష పై సహ నటుడు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్‌ చేసిన కామెంట్స్‌పై కోలీవుడ్ తారలు ఫైరవుతున్నారు. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ కామెంట్స్ పైన త్రిష స్పందించారు. తన పై చేసిన వ్యాఖ్యలు అసహ్యంతో పాటు చాలా బాధని కూడా కలిగించాయన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన నెటిజెన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

త్రిష పై కామెంట్స్: విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలో కనిపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మన్సూర్ త్రిషపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతను చేసిన అసభ్యకరమైన కామెంట్స్‌ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. "లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసింది.

Trisha Krishnan has slammed her Leo co-star Mansoor Ali Khan for his derogatory mark

నేను కూడా ఈ సినిమాలో నటించా. కానీ సినిమాలో ఒక్క బెడ్‌రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నా. నేను ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్‌రూమ్‌కు తీసుకెళ్తానని అనుకున్నా. ఇంతకుముందు సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. సినిమాల్లో ఇది నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు..." అంటూ కామెంట్స్ చేశారు.

త్రిష సీరియస్: దీంతో మన్సూర్ అలీ ఖాన్‌పై పలువురు తారలు మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి సినిమాల్లో ఎందుకు అవకాశాలిస్తున్నాంటూ నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై తాజాగా హీరోయిన్ త్రిష తన ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు. మన్సూర్ ఆలీ ఖాన్ తన పై చేసిన వ్యాఖ్యలు అసహ్యంతో పాటు చాలా బాధని కూడా కలిగించాయన్నారు. తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

ఆయన వ్యాఖ్యల్లో విశృంఖల, అగౌరవం, స్త్రీ ద్వేషం కనిపిస్తున్నాయి. అతనిలాంటి దారుణమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్ ని పంచుకోనందుకు నేను కృతజ్ఞురాలిని, నా మిగిలిన సినిమా కెరీర్లో కూడా అతనితో నటించకుండా చూసుకుంటాను. అతనిలాంటి వ్యక్తులు మానవాళికి చెడ్డ పేరు తెస్తారని ఆమె తన పోస్ట్ లో పేర్కొన్నారు.

త్రిషకు మద్దతుగా: ఈ వ్యవహారంలో సినీ ప్రముఖులతో పాటుగా నెటిజెన్లు త్రిషకు మద్దతుగా నిలుస్తున్నారు. మీకు మేమున్నాం మేడం అధైర్య పడకండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష కలిసి నటించిన గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ లియో. మంచి అంచనాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ తెరకెక్కగా కీలక పాత్రల్లో గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ ఆలీ ఖాన్ నటించారు. ఇప్పుడు త్రిష స్పందిస్తూ ఘాటుగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+