విజయ్ సీఎం అయిన వేళ.. త్రిషకు 12 కోట్ల జాక్‌పాట్..??

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దూసుకెళ్తున్నారు. సీఎం అయిన రెండో రోజు నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించింది. విజయ్ కు అనుకూలంగా 144 ఓట్లు, వ్యతిరేకంగా 22 ఓట్లు వచ్చాయి. ఇక పీఎంకే, బీజేపీకు చెందిన ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. ఈ మేరకు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వారికి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇక విజయ్ ప్రమాణస్వీకారానికి సౌత్ బ్యూటీ త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. నీలిరంగు కంచి పట్టుచీర, జడలో మల్లెపూలతో తమిళ సంప్రదాయం ఉట్టిపడేలా ఆమె కనువిందు చేశారు. స్టేజీ వద్ద అందరికీ అభివాదం చేస్తూ వేడుకకు హజరైన అతిథులను ప్రత్యేకంగా పలకరించారు. అలాగే వేదిక మీద నుంచి విజయ్ సైతం త్రిషను నవ్వుతూ పలు మార్లు చూశారు. అయితే విజయ్ సీఎం అయిన వేళ త్రిషకు భారీ ఆఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్- రజనీకాంత్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ కోసం త్రిషను సంప్రదించినట్లు సమాచారం.

Trisha Offered Staggering 12 Crore for Kamal Haasan-Rajinikanth Combination Film Kollywood Buzz

ఈ మూవీలో నటించేందుకు త్రిషకు ఏకంగా రూ. 12 కోట్లు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ ఈ భారీ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి త్రిష ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేక వ్యక్తిగత కారణాలతో సినిమాలను తగ్గిస్తుందా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి విజయ్- త్రిషల ప్రేమ వ్యవహారం మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఇద్దరి కాంబోలో గిల్లి, తిరుపాచ్చి , ఆతి, కురువి, లియో సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే విజయ్- త్రిష పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+