మొత్తానికి విజయ్‌తో రిలేషన్‌పై ఓపెన్ అయిన త్రిష
హీరోయిన్ త్రిష ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు. తన 20 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారామె. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది. అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. 'పొన్నియర్ సెల్వం' రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లియో' సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
'లియో' సినిమా సక్సెస్‌తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీ మారారు త్రిష. త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే..ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంటోంది. తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్దమయ్యారంటూ ప్రచారం జరిగింది. విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు కూడా వెలిశాయి. ఇదే సమయంలో త్రిష విజయ్ కోసం అతని సినిమాలో ఐటం సాంగ్‌లో కూడా నటించారు. విజయ్ కోసం కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఐటం సాంగ్‌లో నటించారామె. హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లికి కూడా విజయ్ , త్రిష స్పెషల్ ఫ్లైట్‌లో గోవాకు వెళ్లారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా త్రిష ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
"నేను విజయ్‌కి ప్రత్యేక అభిమానిని. ఆయన ఎప్పటికీ నాకు ప్రత్యేకమే. విజయ్ చాలా లవబుల్ పర్సన్, అతనితో వర్క్ చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ త్రిష రియాక్ట్ అయ్యారు.విజయ్‌పై తనకున్న ప్రేమను ఇలా చెప్పిదంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం త్రిష విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications