ఎయిర్ పోర్టులో త్రిషకు చేదు అనుభవం.. వీడియో వైరల్

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష ఇటీవలి కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ విడాకుల వ్యవహారం నేపథ్యంలో త్రిష ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. విజయ్ భార్య సంగీత.. పరోక్షంగా త్రిషపై కామెంట్స్ చేసినట్లు తమిళ మీడియా కోడై కూసింది. తన భర్త ఇండస్ట్రీలోని ఓ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని అన్నారు. తనకు న్యాయం జరగకపోతే ఆమె ఎవరో బయటపెడతానని సంచలన ఆరోపణలు చేశారు. అయితే సంగీత కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే విజయ్ కు సంగీత విడాకులు ఇస్తూ కోర్టును ఆశ్రయించారు. దాంతో విజయ్- సంగీత ఫ్యామిలీ ఇలా అవ్వడానికి త్రిష కారణం అంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఇటీవల చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుక కార్యక్రమానికి త్రిష- విజయ్ ఇద్దరూ కలిసి ఒకే కారులో రావడం హాట్ టాపిక్ అయింది. అంతేకాక ఇద్దరూ ఒకే రకమైన అవుట్ ఫిట్ ధరించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సంగీత చెప్పిన ఆ హీరోయిన్ త్రిష అని నెట్టింట బలంగా ప్రచారం నడుస్తోంది.

Trisha Tense Chennai Airport Moment Walks Away Silently on Vijay Questions from Media video viral

ఈ పరిణామాల మధ్య తాజాగా త్రిష చెన్నై ఎయిర్ పోర్టులో కనిపించారు. ఎయిర్ పోర్టులో త్రిష ప్రత్యక్షం కాగా.. ఈ క్రమంలో కొంతమంది రిపోర్టర్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. విజయ్ గురించి పదే పదే క్వశ్చన్స్ అడగడం ప్రారంభించారు. దాంతో ఆమె వారికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మరోవైపు విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ చెంగల్ పట్టు జిల్లాలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏప్రిల్ 20న కోర్టు విచారణ చేపట్టనుంది. ఇక విజయ్ కు ఇటీవల వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా విజయ్ కుమారుడు తన ఇంటిపేరును మార్చుకున్నట్లు సమాచారం. ఇక విజయ్ చివరి సినిమా జన నాయగన్ మూవీ విడుదలకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరి ఈ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తుందో వేచి చూడాలి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+