స్టార్ హీరోతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన త్రిష..?
హీరోయిన్ త్రిష ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు. తన 20 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారామె. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది. అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
లియో సినిమా సక్సెస్‌తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీ మారారు త్రిష. తన తోటి హీరోయిన్లందరూ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయితే త్రిష మాత్రం ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే ఇప్పుడు త్రిష క్రేజ్ మరింత పెరిగింది. వరుస సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటిని ఇస్తున్నారామె.

త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే..ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంటోంది. సోషల్ మీడియాలో యాక్టిట్‌గా ఉండే త్రిష, తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. హీరో విజయ్‌తో కలిసి త్రిష వెకేషన్‌కు వెళ్లినట్టు ఉందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్దమయ్యారంటూ ప్రచారం జరిగింది. విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు కూడా వెలిశాయి. ఈక్రమంలోనే నెటిజన్లు ఈవిధంగా రియాక్ట్ అవుతున్నారు. త్రిష ప్రస్తుతం మొరాకో వెకేషన్‌లో ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలనే ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications