డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్..క్రెడిట్ కొట్టేసింది పోసాని: బయటపడ్డ నిజం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ తొలినాళ్ల గురించి తాజాగా బయటపెట్టిన ఒక ఆసక్తికర విషయం టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. తాను ఇండస్ట్రీకి వచ్చాక రాసిన తొలి సంభాషణలు వెంకటేష్ సినిమా కోసమేనని ఆయన వెల్లడించగా.. మరి ఆ సినిమాల క్రెడిట్స్‌లో మాత్రం పోసాని కృష్ణమురళి పేరు ఎందుకు ఉంది? అసలు తెరవెనుక ఏం జరిగింది? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

'ఇరుముడి' కి మించిన స్టోరీ, ఎమోషన్ తో విజయ్ ఆంటోని సినిమా.. ఆ రోజే రిలీజ్
'ఇరుముడి' కి మించిన స్టోరీ, ఎమోషన్ తో విజయ్ ఆంటోని సినిమా.. ఆ రోజే రిలీజ్

తొలి సినిమాగా 'స్వయం వరం'

సాధారణంగా త్రివిక్రమ్ రచయితగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాగా 1999లో వచ్చిన 'స్వయంవరం' పేరునే అందరూ చెబుతుంటారు. కానీ, తాజాగా వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న తొలి చిత్రం 'ఆదర్శ కుటుంబం'లోని 'నారాయణమ్మ' సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ స్వయంగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నారు. తనకు ఇష్టమైన హీరో వెంకటేష్‌తోనే తన సినీ ప్రయాణం మొదలైందని, ఆయన నటించిన 'పవిత్ర బంధం' (1996) సినిమా కోసమే తాను తొలిసారి డైలాగ్స్ రాశానని ఆయన తెలిపారు. అప్పట్లో వెంకటేష్‌కి తన గురించి పెద్దగా తెలియకపోయినా, తాను రాసిన మాటలు నచ్చి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తన గురించి ఆరా తీశారని త్రివిక్రమ్ గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలోనే వచ్చిన మరో చిత్రం 'పెళ్లి చేసుకుందాం' (1997)కి కూడా త్రివిక్రమ్ పనిచేశారు.

మేకింగ్ లో మొనగాడు..: నేటితో రాజమౌళి పాతికేళ్ల సినిమా ప్రయాణం
మేకింగ్ లో మొనగాడు..: నేటితో రాజమౌళి పాతికేళ్ల సినిమా ప్రయాణం
Trivikram penned the dialogues while Posani took the credit heres what really happened

మరి పేరు ఎందుకు లేదు?

అయితే ఇక్కడే సినీ విశ్లేషకుల్లో, ప్రేక్షకుల్లో ఒక పెద్ద సందేహం తలెత్తుతోంది. త్రివిక్రమ్ స్వయంగా తాను ఆ సినిమాలకు డైలాగ్స్ రాశానని చెబుతున్నప్పటికీ.. అధికారికంగా అందుబాటులో ఉన్న 'పవిత్ర బంధం', 'పెళ్లి చేసుకుందాం' చిత్రాల టైటిల్ క్రెడిట్స్‌లో డైలాగ్ రైటర్‌గా మాత్రం పూర్తిగా పోసాని కృష్ణమురళి పేరే కనిపిస్తోంది. ఐఎండీబీ, ఇతర సినిమా రికార్డుల ప్రకారం ఆ రెండు సినిమాలకు మాటలు అందించింది పోసానినే అని ఉంది. దీంతో, అప్పట్లో త్రివిక్రమ్ రాసిన మాటలకు లేదా ఆయన చేసిన సహాయానికి సరైన క్రెడిట్ దక్కలేదా? లేక పోసాని ఆ క్రెడిట్‌ను తీసుకున్నారా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఏదేమైనా, మాటల మాంత్రికుడిగా ఇండస్ట్రీని ఏలుతున్న త్రివిక్రమ్ కెరీర్ ఆరంభ రోజుల్లో ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలు జరగడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+