త్రివిక్రమ్ కు అల్లు అర్జున్ పై ఉన్న ప్రేమ మహేష్ బాబుపై లేదు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా గుంటూరు కారం సినిమా రూపుదిద్దుకుంటోంది. హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు గతంలో రెండు సినిమాలు అతడు, ఖలేజా చేశాడు. వెండితెరపైకన్నా బుల్లితెరపై ఇవి సూపర్ హిట్ అయ్యాయి.
పవన్ కల్యాణ్ తో అత్తారింటికి దారేది చేసిన తర్వాత అజ్ఞాతవాసి చేశాడు. అది దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా సమయంలో త్రివిక్రమ్ కాస్తంత అహంకారంతో వ్యవహరించినట్లు వార్తలు వచ్చాయి. గుంటూరు కారం విషయంలో కూడా హీరోయిన్ విషయంలో, మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో హీరోతో పట్టుబట్టడం, షూటింగ్ అనేకమార్లు వాయిదా పడుతూ వస్తుండటం, అనుకున్నస్థాయిలో ప్రమోషన్లు లేకపోవడంలాంటివన్నీ ఈ సినిమాపై ఆసక్తిని తగ్గించేస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత హిట్టవుతుందా? ఫ్లాపవుతుందా? అనేది సెకండరీ అని, ముందు సంక్రాంతికి విడుదల చేయడమంటే గొప్పేనంటూ వ్యంగ్యోక్తులు వస్తున్నాయి.

అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ మూడు సినిమాలు రూపొందించారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో. వీటిని గమనిస్తే ప్రతి సినిమాను త్రివిక్రమ్ ఎంతో శ్రద్ధపెట్టి తీసినట్లు అర్థమవుతోందని విశ్లేషకులు అంటారు. అటువంటి శ్రద్ధ గుంటూరు కారంపై ఎందుకు పెట్టడంలేదంటున్నారు.
మహేష్ మూడోసారి అవకాశం ఇస్తే సినిమాను మంచిగా తెరకెక్కించాల్సింది పోయి షెడ్యూల్స్ ఆలస్యం చేసుకోవడం, కథ, కథనాల విషయంలోనూ హీరోని సరిగా మెప్పించలేకపోవడంలాంటివన్నీ చూస్తుంటే మహేష్ మీద ఎందుకో త్రివిక్రమ్ ఆ ప్రేమ, ఆ శ్రద్ధ కనపడటంలేదనే కామెంట్లు వస్తున్నాయి. గుంటూరు కారం ఇప్పటకీ సంక్రాంతికి వస్తుందంటే చాలా మంది ఇండస్ట్రీ జనాలే నమ్మట్లేదు.












Click it and Unblock the Notifications