జాకెట్ విప్పుతున్న అనసూయపై ట్రోలింగ్
అనసూయ అనే పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్‌గా పరిచయమై ప్రేక్షకుల్లో మంచి పేరుతోపాటు క్రేజ్ కూడా తెచ్చుకుంది. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని తెచ్చుకొని టీవీల నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది. సినిమాల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం యాంకరింగ్ మానేసి సినిమాలే చేస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన అనసూయ విభిన్నమైన పాత్రల్లో నటించడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
శేఖర్ మాస్టర్, అనసూయ మధ్య పోటీ
టెలివిజన్ షోలు మానుకున్న తర్వాత జబర్దస్త్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అందులో చేసే డబుల్ మీనింగ్ కామెడీ తనకు అంతగా నచ్చలేదని వ్యాఖ్యానించింది. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఇప్పుడు టీవీ షోలు చేయడానికి మొగ్గుచూపుతోంది. తాజాగా ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన ఓ టీవీ షో ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రోమోలో శేఖర్ మాస్టర్, అనసూయ ఇద్దరూ ఏదో పోటీకి సిద్ధపడుతుంటారు. ఈ క్రమంలో ఆమె అందరి ముందు తన జాకెట్ విప్పుతున్న సన్నివేశాన్ని చూపించారు. దీనిపై నెటిజన్లు అనసూయను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

మీ ప్రతాపమంతా బుల్లితెరపైనే
'జాకెట్ విప్పిన' ప్రోమో అంటూ తనను అసభ్యంగా ట్రోల్ చేస్తున్నవారిపై అనసూయ ఘాటుగా బదలిస్తోంది. ఇదంతా నాన్సెన్స్ అని, ఏమన్నా అంటే అనసూయ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దీనికి అనసూయ మీరు పెట్టిన ఎమోజీలు, మీ మైండ్ సెట్ చూస్తుంటే ఏదో మానసిక రోగంతో బాధపడుతున్నట్లు అర్థమవుతోందంటూ ఘాటుగా ఇచ్చిపడేసింది. పరిశ్రమకు చెందిన వ్యక్తులుగా తాము కొన్ని కొన్ని చేయక తప్పదని, ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని అనసూయ చెప్పింది. ఇది వీరికి అర్థం కావడంలేదని, మీ ప్రతాపం అంతా బుల్లితెరపైనే చూపిస్తుంటారని, సినిమాల్లో ఎంత బోల్డ్ గా ఉంటే అంత బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తారంది. కొందరికి ప్యాంట్, చొక్కా కూడా ఇబ్బందేనని, నేనేం చెప్పానో మీకు అర్థమైందనుకుంటున్నానని, ఇకనైనా మారండి అంటూ సీరియస్ అయింది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.












Click it and Unblock the Notifications