'టుక్ టుక్' మూవీ టీం కొత్త ప్రయోగం... AI టెక్నాలజీతో సాంగ్ షూట్

తెలుగు సినిమా స్థాయి రోజురోజుకీ మరింత పెరుగుతోంది. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్ కి గుర్తింపు దక్కింది. నాటి నుంచి అత్యున్నత సాంకేతిక పరిజ్క్షానంతో మన సినిమాలు కూడా హాలీవుడ్‌ సినిమాలతో పోటీపడుతున్నాయి. మారుతున్న కాలానుగుణంగా సినిమాను ప్రేక్షకులకు మరింత కనెక్ట్ చేసేందుకు చిత్ర బృందం కొత్త కొత్త ప్రయోగాలతో ముందుకు వస్తున్నారు. రెగ్యులర్ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ కాకుండా ఇంకాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్క్షానాన్ని సినిమాల్లోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే టుక్‌ టుక్‌ మూవీ టీం సరికొత్త ప్రయోగం చేసింది.

తొలిసారిగా భారతీయ సినిమా చరిత్రలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ టెక్నాలజీతో ఓ పాటను ఘాట్ చేశారు. టుక్ టుక్ సినిమాలో 'ఏలా అల తీపికోరే పూలతోట' అంటూ సాగే పాట విజులవ్స్‌ ఏఐ టెక్నాలజీతో రూపొందించారు. సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. ఇక ఈ పాటకు డైరెక్టర్ కృష్ణనే సాహిత్యం అందించగా.. సంతు ఓంకార్‌ స్వరాలు అందించారు. ఏఐ ఈ పాటను బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్‌ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.

Tuk Tuk movie team s new experiment song shoot with AI technology

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్‌. ఏఐ టెక్నాలజీతో పాటను చిత్రీకరించడం ఎంతో ఆనందంగా ఉందని.. తప్పకుండా థియేటర్‌లో ఆడియన్స్‌ ఈ పాటను ఎంజాయ్‌ చేస్తారని వెల్లడించారు.

ఇక రీసెంట్ గానే సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన మజాకా సినిమా రిలీజ్ అయ్యింది. 'మన్మథుడు' ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేశ్ దండా, ఉమేష్ కేఆర్ బన్సాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి ప్రసన్నకుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. మహా శివరాత్రి పండగ సందర్భంగా ఫిబ్రవరి 26న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను రిలీజ్ అయ్యింది. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది.

ఈ సినిమా కోసం కూడా కొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో పబ్లిసిటీ చేసింది మూవీ యూనిట్. సాంగ్ షూటింగ్ ని లైవ్ లో చూపించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇప్పుడు ఏకంగా ఒక పాటను ఏఐతో క్రియేట్ చేయడం మరింత కొత్తగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+