స్టేజ్ 2 లివర్ క్యాన్సర్ బారిన పడ్డ టీవీ నటి- తన కోసం ప్రార్థించాలంటూ

Dipika Kakar: ప్రముఖ టీవీ సీరియల్స్ నటి దీపిక కకార్ ప్రమాదకర లివర్ క్యాన్సర్ బారిన పడ్డారు. దీని తీవ్రత- స్టేజ్ 2లో ఉంది. కొంతకాలంగా ఆమె కడుపు నొప్పితో బాధపడుతున్నారు. దీనికోసం ట్రీట్ మెంట్ తీసుకుంటోన్నారు. నొప్పి అధికంగా ఉండటం వల్ల ఆసుపత్రిలో చెకప్ చేయించుకోగా- క్యాన్సర్ గా తేలింది.

ఈ విషయాన్ని దీపిక కకార్ స్వయంగా వెల్లడించారు. ఈ విషయాన్ని తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. కొద్దిరోజులుగా కడుపు పైభాగంలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నానని, ట్రీట్ మెంట్ తీసుకున్న తగ్గలేదని వివరించారు. దీనిపై స్కానింగ్ తీయగా.. క్యాన్సర్ గా తేలిందని చెప్పారు.

TV actress Dipika Kakar diagnosed with stage 2 cancer

కాలేయంలో టెన్నిస్ బాల్ సైజ్ ఉన్న కణితిని డాక్టర్లు గుర్తించారని దీపిక తెలిపారు. ఆ కణితి ప్రమాదకర దశలో ఉందని పేర్కొన్నారు. స్టేజ్ 2 దశలో ఉన్న క్యాన్సర్ గా డాక్టర్లు నిర్ధారించారని చెప్పారు. తన జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదకర లివర్ క్యాన్సర్ ను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నానని దీపక భావోద్వేగంతో వెల్లడించారు. ఎంతో పాజిటివ్ దృక్పథంతో ఉన్నానని, మానసికంగా దృఢంగా ఉన్నానని చెప్పారు. దైవబలం, అభిమానుల ఆశీర్వాదాలు, ఆదరణతో దీన్ని విజయవంతంగా ఎదుర్కొంటానని అన్నారు.

ఈ కష్ట సమయంలో తన కుటుంబం మొత్తం ఉండగా ఉందని, అభిమానుల ప్రేమాభిమానాలతో సంపూర్ణ ఆరోగ్యవంతురాలైని అవుతానని చెప్పారు. దీన్ని అధిగమిస్తానని చెప్పారు. డాక్టర్ల సూచనల మేరకు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని, తన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

2010లో తొలిసారిగా బుల్లితెరపై అడుగు పెట్టారు దీపిక కకార్. నీర్ భరే తేరే నైనా దేవి.. ఆమె నటించిన మొదటి సీరియల్. ఆ తరువాత అగ్లే జనమ్ మోహె, ససురాల్ సిమర్ కా, ఝలక్ దిఖలాజా 8, నాచ్ బలియే 8, ఎంటర్టైన్మెంట్ కీ రాత్, కహా హమ్ కహా తుమ్, సెలెబ్రిటీ మాస్టర్ ఛెఫ్ లల్లో కనిపించారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ 12 సీజన్ విజేతగా నిలిచారు. 2018లో నటుడు షోయబ్ ఇబ్రహీంను వివాహం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+