ఛీ ఇదేం పని ప్రియాంక.. అందరి ముందు అలా చేసేసిందిగా !

ప్రముఖ నటి ప్రియాంక జైన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2018లో 'చెల్తే చల్తే' అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మౌన రాగం, జానకి కలగనలేదు సీరియల్స్ తో ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. ఇక అప్పటి నుంచి సీరియల్స్ తగ్గించిన ఈ భామ.. యూట్యూబ్ వీడియో లతో, సోషల్ మీడియా పోస్టులతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.

ప్రస్తుతం బుల్లితెర నటుడు శివకుమార్ తో రిలేషన్ లో ఉన్న ఈమె.. అతనితో కలిసి ప్రాంక్ వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం కలిసే ఉంటున్న ఈ జంట.. యూట్యూబ్ వీడియో లతో పాటు పలు కార్యక్రమాల్లో సైతం పాల్గొంటూ ఉంటారు. అయితే బిగ్ బాస్ కి వెళ్లక ముందు అచ్చ తెలుగు అమ్మాయిల పద్దతిగా ఉండే ప్రియాంక.. బిగ్ బాస్ వెళ్లొచ్చాక రూట్ మార్చింది. పొట్టి డ్రెస్సుల్లో అందాలను ఆరబోస్తూ, పిచ్చి పిచ్చి ప్రాంక్ వీడియోలతో కాలం గడిపేస్తుంది.

tv-actress-priyanka-jain-latest-video-got-trollings-from-netizens

రీసెంట్ గానే పవిత్రమైన తిరుమల అలిపిరి నడక మార్గంలో పిచ్చి పిచ్చి రీల్స్ చేసి నెటిజన్లతో తివాట్లు పెట్టించుకున్నారు. భక్తితో వెళ్లాల్సిన చోట భక్తుల్లో భయాన్ని రేకెత్తించే ప్రాంక్‌ వీడియో చేనందుకు టీటీడీ కేసు కూడా నమోదు చేసింది. ఆ తర్వాత జిమ్ వీడియోలు, కుంభ మేళా వీడియో అంటూ వ్యూస్ కోసం ఏదైనా చేసేలా మారిపోయారు ఈ జంట. ఇక ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే డాన్స్ షో కోసం అయితే ఏకంగా ఉన్నవన్నీ చూపించేస్తూ అసలు బట్టలు ఉన్నాయా లేవా అనే అనుమానం వచ్చేలా చేస్తోంది.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అందులో ప్రియాంక, శివకుమార్, బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఉన్నారు. వారంతా ఒక రెస్టారెంట్ కి వెళ్లి నూడిల్స్ తింటూ ఉంటారు. అయితే ప్రియాంక తన ప్రియుడితో కలిసి నూడిల్స్ లో ఒక పీస్ ని.. అటు ఒకరు ఇటు ఒకరు తీసుకొని తింటూ ఉంటారు. దాంతో సన్నీ నేను సింగిల్ గా ఇక్కడ ఉంటే మీరిద్దరూ రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తున్నారా అని అంటారు.

ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో కాస్త వైరల్ గా మారింది. వ్యూస్ కోసం పబ్లిక్ లో అదేం పచ్చి పని అంటూ నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. వారిద్దరితో అసలు నువ్వెందుకు కలిశావ్ సన్నీ బ్రో అని.. ఆయన ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. మరి వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఆ పొట్టి బట్టలు, పిచ్చి వీడియోలు ఇంకెన్నాళ్ళు చేస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+