“లివ్-ఇన్ నుంచి లాక్-అప్ వరకు: నటి మాస్టర్ ప్లాన్‌కి బెంగళూరు షేక్ !

బెంగళూరులోని మంజునాథనగర్‌లో చోటుచేసుకున్న ఓ హత్య ఘటన నగరాన్ని కలవరపరిచింది. ప్రేమ, అసూయ, స్వార్థం కలిసిన ఈ ఘటన 12 రోజుల పాటు ఎవరికి తెలియకుండా దాగి ఉండటం మరింత షాకింగ్‌గా మారింది. దుర్వాసనతో బయటపడిన ఈ నేరం వెనుక ఉన్న కథ ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

లివ్-ఇన్ నుంచి బ్రేకప్..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. టీవీ నటి ఊర్మిళ అలియాస్ బిందు కొంతకాలంగా మోహన్ కృష్ణారావు (40)తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో నివసిస్తోంది. ఇద్దరి మధ్య మొదట అనుబంధం బలంగా ఉన్నప్పటికీ, కాలక్రమేణా విభేదాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో బిందు జీవితంలో లారీ డ్రైవర్ వినయ్ ప్రవేశించాడు. అతడిని పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే ఈ నిర్ణయానికి మోహన్ కృష్ణారావు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. పెళ్లి ఆలోచనను ఆపాలని ప్రయత్నించాడు. ఈ పరిస్థితుల్లో బంధం క్రమంగా ఉద్రిక్తతకు దారి తీసింది.

actress-urmila-alias-bindu-murdered-her-boy-friend-with-the-help-of-another-boyfriend

పథకం ప్రకారం జరిగిన పార్టీ..

ఫిబ్రవరి 18న, మోహన్‌తో కలిసి ఉంటున్న ఇంట్లో బిందు ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసింది. బయటకు చూస్తే అది సాధారణ వేడుకలా కనిపించింది. కానీ పోలీసులు చెబుతున్న ప్రకారం, ఆ రాత్రి అన్నీ ముందే ప్రణాళికాబద్ధంగా జరిగాయి.

పార్టీలో మోహన్‌కు అధికంగా మద్యం తాగించారు. అతడు మత్తులో ఉన్న సమయంలో వినయ్ మరియు అతడి స్నేహితుడు ధనుష్ అక్కడికి చేరుకున్నారు. మోహన్‌పై దాడి చేసి, అతడి చేతులు, కాళ్లు కట్టేసి, నోటికి టేపులు చుట్టారు. అనంతరం కత్తితో దాడి చేయడంతో మోహన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటన అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు.

12 రోజుల తర్వాత..

హత్య జరిగిన తర్వాత ఇంటి తలుపులు మూసివేసి ఉండటంతో ఎవరూ అనుమానించలేదు. అయితే 12 రోజుల తర్వాత ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించి సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, పరిసరాల సమాచారం ఆధారంగా అనుమానితులను గుర్తించారు.

ఈ కేసులో నటి బిందుతో పాటు వినయ్, ధనుష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్-వెస్ట్ డీసీపీ డీల్ నాగేష్ తెలిపిన ప్రకారం, నేరంలో ప్రతి ఒక్కరి పాత్రను విచారణలో భాగంగా పరిశీలిస్తున్నారు. పథకం రూపకల్పన నుంచి అమలు వరకు జరిగిన ప్రతి అంశాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. అయితే బిందు 'భజరంగి', 'పోలీస్ క్వార్టర్స్', 'కాలభైరవ' వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించింది. ఇప్పుడు ఆమె పేరు తెరపై కాదు, క్రైమ్ రికార్డుల్లో వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+