ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పు కాదు..వారి కోరికలు తీర్చాలి ..హీరోయిన్ కాజోల్ షాకింగ్ కామెంట్స్
సినీ పరిశ్రమ, ముఖ్యంగా బాలీవుడ్ అంటేనే రంగుల ప్రపంచం. తెరపై కనిపించే ప్రేమ కథల కంటే తెర వెనుక జరిగే రొమాన్స్, ఎఫైర్ల గురించి చర్చ సర్వసాధారణం. బాలీవుడ్‌లో ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని పెళ్లి చేసుకున్న ప్రముఖులు చాలా మందే ఉన్నారు. ఈ పరిణామాలను ఇండస్ట్రీలో 'మెచ్యూరిటీ' పేరుతో స్వీకరిస్తూ ఉంటారు.
దక్షిణాదిలో కొంత గోప్యత పాటించినా, బాలీవుడ్ మాత్రం ఎఫైర్ల విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. స్టార్ హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమ, డేటింగ్, బ్రేకప్‌లు, సీక్రెట్ రొమాన్స్‌ల గురించి రూమర్లు నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుత తరం నటీనటులు రిలేషన్షిప్‌ల గురించి, శృంగారం గురించి కూడా మీడియా వేదికలపై, ఇంటర్వ్యూలలో బహిరంగంగా మాట్లాడటానికి వెనుకాడకపోవడం ఈ ట్రెండ్‌లో వచ్చిన ప్రధాన మార్పుగా చెప్పవచ్చు.

తాజాగా, ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు... వివాహేతర సంబంధాల గురించి చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వారెవరో కాదు... ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన హీరోయిన్లు, ప్రస్తుతం స్నేహితులుగా కలిసి 'టూమచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్' అనే టాక్ షోను నిర్వహిస్తున్న ట్వింకిల్ ఖన్నా , కాజోల్.
వీరిద్దరూ తమ షోలో అక్రమ సంబంధాలు గురించి మాట్లాడుతూ, అవి తప్పేమీ కాదనే ధోరణిలో వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌కు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్, హీరోయిన్ జాన్వీ కపూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. ఫిజకల్ చీటింగ్ కంటే ఎమోషన్ చీటింగ్ పెద్ద నేరమని వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రముఖుల సమక్షంలోనే ట్వింకిల్, కాజోల్ అక్రమ సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
పెళ్లైన తర్వాత వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం పట్ల సమాజంలో తీవ్ర వ్యతిరేకత, భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో, ఇద్దరు సీనియర్ హీరోయిన్లు ఇలాంటి అంశాన్ని సమర్థిస్తూ మాట్లాడటం... పవిత్రమైన వివాహ బంధం విలువను తగ్గిస్తుందా? లేక, ఆధునిక సంబంధాల్లోని సంక్లిష్టతలను అంగీకరించడమా? అనే కోణంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సెలబ్రిటీల ఈ బోల్డ్ కామెంట్స్... సమాజంలో వివాహ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో, ఈ షో ఎపిసోడ్ ప్రసారమయ్యాక ఎలాంటి పరిణామాలు ఉంటాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications