ప్రభాస్‌ను గాఢంగా ప్రేమించి మోసపోయిన ఇద్దరు హీరోయిన్లు

పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ 44 సంవత్సరాలు నిండి 45వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఈరోజున ఆయన భారతదేశంలో నెంబర్ వన్ హీరోగా అవతరించారంటే అందుకు కారణం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి1, బాహుబలి2 సినిమాలు. ఆ తర్వాత కూడా ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ లో భారీ హిట్లు సాధిస్తున్నాయంటే హిందీ బెల్టు ప్రేక్షకులకు డార్లింగ్ ను ఎంతగా అభిమానిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాలు చేస్తున్నారు. ఇవి పూర్తయిన తర్వాత సలార్ 2, కల్కి 2 చేయాల్సి ఉంది. సినిమాల విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించడంతోపాటు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెడుతున్నారు.

కారణాలు ఇప్పటికీ తెలియడంలేదు
సినీ పరిశ్రమలో మన డార్లింగ్ ను ఇద్దరు హీరోయిన్లు ప్రేమించారు. అయితే పెళ్లి విషయంలో ప్రభాస్ ఏమీ మాట్లాడకపోతుండటంతో వారికేమీ పాలుపోలేదు. వారు కూడా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. వెండితెరపై ఈ ఇద్దర హీరోయిన్లతో ప్రభాస్ ను చూసినప్పుడు అభిమానులు ఆనందంలో మునిగిపోయేవారు. అంతగా వారి జంటలు ఆకట్టుకోవడంతోపాటు వారి కెమిస్ట్రీ కూడా అదేస్థాయిలో ఉండేది. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరంటే త్రిష, అనుష్క. త్రిష ప్రభాస్ తో కలిసి వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలు చేసింది. వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరగాల్సి ఉంది. కొన్ని కారణాలవల్ల అది రద్దయింది. అయితే అందుకు కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. త్రిష మాత్రం తమిళ స్టార్ హీరో విజయ్ తో సన్నిహితంగా ఉంటోందంటూ వార్తలు వస్తున్నాయి. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తో త్రిష నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.

Two star heroines deeply loved Prabhas

వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది
ప్రభాస్ తో అనుష్క బిల్లా, మిర్చి, బాహుబలి1, బాహుబలి2 సినిమాలు చేసింది. ఒకరకంగా చెప్పాలంటే అనుష్కకు ప్రభాస్ అంటే ప్రాణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుండేది. అయితే పెళ్లి విషయంలో ప్రభాస్ ఏ విషయం చెప్పలేదా? మరేదేైనా కారణాలున్నాయా? అనే విషయాలు తెలియదుకానీ అనుష్క కూడా ప్రస్తుతం దూరంగానే ఉంటోంది. వీరిద్దరిలో ఎవరిని చేసుకున్నా ప్రభాస్ జీవితం అద్భుతంగా ఉండేదని, అలా కాకుండా పెళ్లి విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతోనే వీరిద్దరూ దారుణంగా మోసపోయారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+