'కల్కి' విజయం వెనక ఆ ఇద్దరు హీరోలు?
యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ తాజా చిత్రం 'కల్కి' రూ.900 కోట్ల కలెక్షన్లను అధిగమించి రూ.వెయ్యి కోట్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. బాహుబలి2 తర్వాత ఆ స్థాయిలో ప్రభాస్ కు వచ్చిన బ్లాక్ బస్టర్ కావడం విశేషం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూ.600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం భాగమైంది. కల్కి ఇంత పెద్ద విజయం సాధించడం వెనక ఇద్దరు హీరోల అభిమానులు ఉన్నారనే విషయంపై వార్తలు వస్తున్నాయి.
ఎన్నికల్లో పవన్ కు మద్దతుగా
ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు.. పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్. ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అందరూ హీరోల అభిమానులు తనను ప్రోత్సహించాలని, మద్దతివ్వాలని కోరారు. ఆయన కోరినట్లుగానే ప్రధానంగా పవన్ కల్యాణ్ అభిమానులతోపాటు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాగా మద్దతుగా నిలబడ్డారు. జనసేన తరఫున పోటీచేసినవారికి ఓట్లు వేయడంతోపాటు పిఠాపురంలో అందరు హీరోల అభిమానులు పవన్ తరఫున నిలబడ్డారు. దీంతో ఘనవిజయాన్ని కైవసం చేసుకున్నారు పవన్.

ఆ ఇద్దరు హీరోల అభిమానులే కారణం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మాట్లాడుతూ కల్కి చిత్రం ఇంత భారీ సక్సెస్ అవడానికి పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కారణమని, వారందరూ పరోక్షంగా సాయం చేశారని చెప్పారు. కల్కి చిత్రానికి పవన్ కల్యాణ్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులిద్దరూ పోటెత్తడంతో భారీ కలెక్షన్లు రావడంతోపాటు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత విడుదలయ్యే తారక్ దేవర చిత్రానికి, పవన్ కల్యాణ్ ఓజీ చిత్రానికి మొత్తంగా ఈ ముగ్గురు అభిమానులు కలిసి సూపర్ హిట్ చేస్తారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications