డాకూ మహారాజ్ ఫస్ట్ రివ్యూ: 3 స్టార్ ఇచ్చిన క్రిటిక్
నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా, కొల్లి బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రరాజం డాకూ మహారాజ్. సితార ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మించారు. ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీడియోల్, రిషి, చాందినీ చౌదరి తదితరులు నటించారు. తమన్ సంగీతాన్ని అందించారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరుసగా హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కూడా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో నందమూరి అభిమానులున్నారు.
బాలయ్య, బాబీడియోల్ పైసావసూల్
ఈనెల 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. వాస్తవానికి ఈ సినిమా నుంచి విడుదలైన దబిడి దిబిడి పాట చూసిన తర్వాత కుటుంబ ప్రేక్షకులు థియేటర్ కు రారేమో అన్న సందేహం అందరికీ వచ్చింది. అయితే ఈ పాట సూపర్ హిట్ అయింది. ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ ప్రకారం మాస్ ఆడియోన్స్ కు అద్భుతంగా నచ్చుతుందని, అలా ఈ సినిమాను దర్శకుడు బాబీ రూపొందించారన్నారు. యాక్షన్ ఒక రేంజ్ లో ఉందని, భావోద్వేగాలు, హాస్యం, డ్రామ.. ఇలా అన్నింటినీ బాబీ సమపాళ్లలో నింపాడని చెప్పాడు. బాలకృష్ణ, బాబీడియోల్ కలిసి పైసా వసూల్ సినిమాను చేశారని, పక్కా అని, వీరిద్దరి నటన సినిమాకు ఆయువుపట్టు అని సంధు ట్విటర్ లో రాసుకొచ్చారు.

ఆ మూడు సినిమాలు వాస్తవమయ్యాయి
వాస్తవానికి ఉమైర్ సంధు ఇస్తున్న రేటింగ్స్ ను ఎవరూ పట్టించుకోవడంలేదు. గతంలో అతను ఇచ్చినదానికి విరుద్ధంగా జరిగేవి. కానీ పుష్ప2, దేవర, గేమ్ ఛేంజర్ తర్వాత తిరిగి అతన్ని నమ్ముతున్నారు. పుష్ప2, దేవరకు 3 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గా నిలుస్తుందని చెప్పగా, మొదటిరోజు మొదటి ఆట నుంచే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. డాకు మహారాజ్ కు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుందంటున్నారు. సంక్రాంతి పండగకు యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులకు మొదటి ఛాన్స్ గా డాకూ మహారాజ్ మారుతుందని, ఈ సినిమాతో కూడా బాలయ్య మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నట్లేనని, సీనియర్ హీరోల్లో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్నాడంటున్నారు. ఉమైర్ సంధు చెప్పినదాని ప్రకారం జరుగుతుందా? లేదా? అనేది మరో రోజులో తేలిపోనుంది.
-
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!












Click it and Unblock the Notifications