అరేయ్ ఏంట్రా ఇది.. శ్రీలీల చేయి పట్టుకుని బలవంతంగా గుంపులోకి లాగి..

తమ అభిమాన హీరో, హీరోయిన్లు కనపడితే ఆనందంలో గెంతులేస్తాం.. చప్పట్లు, ఈళలతో గోల చేస్తాం. కానీ అది హద్దు మీరితే ఎవరికైనా చిరాకుగా అనిపిస్తుంది. అలాంటి ఓ షాకింగ్ ఘటనే తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటికి జరిగింది. అవును.. టాలీవుడ్ స్టార్ నటి శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు అత్యుత్సాహం ప్రదర్శించి.. ఆమె చేయి పట్టుకుని బలవంతంగా గుంపులోకి లాగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Unfortunate Incident Sreeleela Dragged by Miscreants in Public Gathering

ఏం జరిగింది..?

ప్రస్తుతం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా నటిస్తున్నారు. అనురాగ్‌ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందు కోసం మూవీటీమ్ ఇటీవల డార్జిలింగ్‌కు వెళ్లింది. అక్కడ షూటింగ్ ముగిశాక కార్తిక్‌ ఆర్యన్‌తో కలిసి ఆమె తిరిగి వస్తున్న సమయంలో ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు శ్రీలీల చేయి పట్టుకుని గుంపులోకి గుంజారు. దీంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. వారిని విడిపించుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన సిబ్బంది ఆమెను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిమానులపై ఫైర్ అవుతున్నారు. ఇలా చేయడం బాలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+