ఉపాసన మొబైల్ లో చరణ్ నెంబర్ ఏ పేరుతో ఉంటుందో తెలుసా..?
టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ కపుల్స్ లో రామ్ చరణ్- ఉపాసన ముందు వరుసలో ఉంటారు. అయితే సెలబ్రిటీస్ బయట ఎలా ఉంటారు..? ఇంట్లో ఎలా ఉంటారు..? ఏం తింటారు..? ఫిట్ గా ఉండేందుకు ఎలాంటి ఎక్సర్ సైజ్ లు చేస్తారు..? ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరూతుంటారు. అందుకే వాళ్ల గురించి ఏ విషయం బయటకు వచ్చినా ఫుల్ వైరల్ అయి పోతుంటుంది. అలాగే రామ్ చరణ్ లైఫ్ స్టైల్, ఆయన ఇంట్లో, ఫ్యామిలీతో ఫ్రెండ్స్ ఎలా ఉంటారని తెలుసుకునేందుకు మెగా ఫ్యాన్స్ తహతహలాడుతుంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చరణ్ సతీమణి ఉపాసన ఓ ఆసక్తికర విషయాన్ని బయటకు చెప్పింది. ఇంతకీ ఏంటో అది తెలుసుకోవాలని ఉందా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆయన సతీమణి ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. సాధారణంగా సెలబ్రిటీలు అయినా సాధారణ వ్యక్తులైన భార్యాభర్తలు తమ ఫోన్ నెంబర్లను వెరైటీ పేర్లతో సేవ్ చేసుకుంటారు. అయితే చరణ్ నెంబర్ ను ఉపాసన తన ఫోన్ లో రామ్ చరణ్ 200 అనే పేరుతో సేవ్ చేసుకుందట. ఇప్పటి వరకు చరణ్ 199 సార్లు మొబైల్ నెంబర్ ను మార్చుకున్నారట. ఇప్పుడు 200 వ నెంబర్ ను వాడుతున్నారు. అందుకే రామ్ చరణ్ కు పేరు రామ్ చరణ్ 200 అనే పేరుతో సేవ్ చేసినట్లు తెలిపింది.

ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26, 2025 రిలీజ్ కానుంది.












Click it and Unblock the Notifications