నా భర్త రామ్‌చరణ్‌తో ఆ హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది: ఉపాసన
రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు భారతదేశంలో కూడా రామ్ చరణ్ - ఉపాసన జంట గురించి పరిచయం చేయాల్సిన అవసరంలేదు. సేవా కార్యక్రమాలద్వారా, అపోలో ఆసుపత్రికి ఒక డైరెక్టర్ గా, మ్యాగజైన్ ఎడిటర్ గా ఉపాసన పేరు తెచ్చుకుంది. రామ్ చరణ్ చిరంజీవి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ తన స్వయంకృష్టితో ఆర్ఆర్ఆర్ సినిమాద్వారా పాన్ ఇండియా హీరో అయ్యారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఎవరైనా, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆదుకోవడానికి మాత్రం ఈ జంట చాలా ముందుంటుంది. ఇద్దరిదీ చాలా మంచి మనసు అంటూ పరిశ్రమ మొత్తం కొనియాడుతుంటుంది. ఈ జంటకు వివాహమైన 11 సంవత్సరాల తర్వాత క్లింకార అనే అమ్మాయి జన్మించింది.
తనకు తమన్నా అంటే చాలా ఇష్టం
రామ్ చరణ్ తన వృత్తి రీత్యా అనేకమంది హీరోయిన్లతో కలిసి నటించాల్సి ఉంటుంది. అందరితో ఎంతో స్నేహంగా మెసలుకుంటారు. అయితే తన భర్తతో నటించి హీరోయిన్లందరిలో ఉపాసనకు మాత్రం తమన్నా అంటే చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. రామ్ చరణ్ తో తమన్నా కెమిస్ట్రీ చాలా బాగుంటుందని, తనకెంతో ఇష్టమని చెప్పింది. ప్రస్తుతం ఉపాసన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. స్క్రీన్ మీద వారిద్దరినీ చూస్తే తనకు బాగా నచ్చుతుందని, మా ఆయన పక్కన తమన్నానే చాలా బాగుంటుందని ఉపాసన వ్యాఖ్యానించింది. దీంతో ఉపసాన చెప్పిన మాటలకు మెగా అభిమానులు కూడా షాక్ అయ్యారు.

ఉపాసన ఎంత మెచ్యూరిటీతో ఉంది
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉపాసన ఎంత బ్రాడ్ మైండ్ తో ఆలోచిస్తోంది? ఎంత మెచ్యూరిటీ ఉంది? ఎవరికైనా ఇలా ఉంటుందా? ఈరోజుల్లో తన భర్త రోడ్డుమీద వెళుతున్న ఒక స్త్రీని పట్టి పట్టి చూస్తేనే అతనిమీద చాలా గొడవ పడే భార్యలున్న రోజుల్లో ఇంత బహిరంగంగా తన భర్తతో ఓ హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుందని, అందులోను తనకు బాగా నచ్చుతుందని చెప్పడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని, ఇంత తక్కువ వయసులోనే అంత చక్కగా ఆలోచించగలిగే నేర్పు ఉండే భార్య దొరకడం కూడా రామ్ చరణ్ అదృష్టమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రామ్ చరణ్ - తమన్నా కలిసి సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఈ జంటకు పేరొచ్చింది.












Click it and Unblock the Notifications