గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన..మెగా వారసుడు రాబోతున్నాడు
టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా, తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ - ఉపాసన దంపతుల గురించి ఎప్పుడూ ఆసక్తికరమైన వార్తలు వస్తూనే ఉంటాయి. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులై, తమ కూతురు క్లీన్ క్లారా రాకతో మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు నింపిన ఈ జంట ఇప్పుడు మరోసారి శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
క్లీన్ క్లారా పుట్టిన తర్వాత ఉపాసన మాట్లాడుతూ, ఆలస్యంగా తల్లిని కావాలని నిర్ణయించుకున్నా, రెండవ బిడ్డ విషయంలో అలాంటి ఆలస్యం చేయాలని అనుకోవడం లేదని, తాను త్వరలోనే రెండోసారి తల్లి కావడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి.

తాజాగా, ఉపాసన కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీపావళి సందర్భంగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ఒక వీడియోను షేర్ చేస్తూ, "ఈ దీపావళి పండుగ రెట్టింపు వేడుకలు, ప్రేమ రెట్టింపు, ఆశీర్వాదాలు" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
'రెట్టింపు వేడుకలు', 'ప్రేమ రెట్టింపు'అనే పదాలను ఉపాసన వాడటంతో... మెగా అభిమానులు, నెటిజన్లు ఉపాసన మరోసారి గర్భవతి అయ్యారని దాదాపు కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ, సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువ కురిపిస్తున్నారు.
వాస్తవానికి, ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్‌తో పాటు ఉపాసన కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ఉపాసన మెట్లు దిగుతూ కనిపించగా, రామ్ చరణ్ ఆమె చేయి పట్టుకుని ఎంతో జాగ్రత్తగా దించడం కనిపించింది. అంతేకాకుండా, ఉపాసన తన పొట్ట కనిపించకుండా జాగ్రత్త పడుతున్నట్లు గమనించినప్పటి నుంచే ఆమె ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు జోరందుకున్నాయి.
ఇప్పుడు దీపావళి పోస్ట్‌తో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. 'క్లీన్ క్లారా' రాకతో సంబరాల్లో తేలిన మెగా కుటుంబం, రెండో బిడ్డ రాకతో నిజంగానే రెట్టింపు ఆనందాన్ని పొందబోతోందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications