స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన 'బేబీ' బ్యూటీ?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రంలో నటిస్తున్నారు. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ సూపర్ హిట్లు ఇచ్చి ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. అగ్ర కథానాయకుల్లో బాలయ్య ఒక్కరే జోష్ చూపిస్తున్నారు. తన తర్వాత సినిమాలపై రోజురోజుకు పరిశ్రమతోపాటు అభిమానుల్లో కూడా అంచనాలు పెరిగిపోతున్నారు. బాబీతో చేస్తున్న చిత్రం సోషియో ఫాంటసీ నేపథ్యంలో రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో కథానాయికగా జెర్సీ, సైంధవ్ చిత్రాల్లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించబోతుంది. బేబీ సినిమాతో యువతరాన్ని తనవైపు తిప్పుకున్న వైష్ణవి చైతన్య కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బేబీ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండతోనే ఓ చిత్రం చేస్తోంది. తాను ఏ సినిమాలు ఒప్పుకుంది అనే విషయంపై పూర్తిస్థాయిలో స్పష్టత రానప్పటికీ కథల ఎంపికలో ఈ బేబీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. తెలుగమ్మాయి స్టార్ హీరోయిన్ గా, స్టార్ కథానాయకుల సరసన నటించడం చాలా అరుదు.

కానీ ఒక తెలుగమ్మాయి కూడా స్టార్ హీరోయిన్ కాగలదంటూ.. దాన్ని నిరూపించాలనే పట్టుదలతో ఈ బేబీ బ్యూటీ ఉంది. తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత వరుస అవకాశాలు దక్కుతున్నాయి. వస్తున్నాయి కదా అని ఏ ఆఫర్ ను ఒప్పుకోవడంలేదు. కథ నచ్చడంతోపాటు తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే అంగీకరిస్తోంది. బాలకృష్ణ కథానాయకుడిగా నటించే చిత్రంలో అవకాశం రావడం అంటే సాధారణ విషయం కాదు. ఇందులో ఏ పాత్రలో నటిస్తుందనే విషయమై స్పష్టత రాలేదు. చిత్ర యూనిట్ కూడా ఇంకా ధ్రువీకరించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది. బాలయ్య సినిమాలో నటించిన తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఈ అమ్మడుకు.












Click it and Unblock the Notifications