Valentine's Day OTT Releases: ఓటీటీల్లోకి 20 పైగా సినిమాలు
ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే అంటే లవర్స్ కు పండగే. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీస్ అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారంలోనే దాదాపు 20 కిపైగా సినిమాలు, సిరీస్ లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
మలయాళ నటుడు ఉన్నిముకందన్ లీడ్ రోల్ లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మార్కో. ఈ మూవీకి హనీఫ్ దర్శకత్వం వహించాడు. ఫుల్ యాక్షన్ జానర్లో ఈ మూవీ కొనసాగుతుంది. గతేడాది డిసెంబర్ 20న మలయాళంలో రిలీజైన ఈ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత జనవరి 1న తెలుగులో జనవరి 3న తమిళ్ లో రిలీజ్ అయింది. రిలీజైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ మలయాళంలో రూ. 100కోట్లు గ్రాస్ రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మూవీ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న సోనీ లీవ్ ఛానల్ లో రిలీజ్ కానుంది.

యామీ గౌతమ్, ప్రతిక్ గాంధీ లీడ్ రోల్ లో నటించిన మూవీ ధూమ్ ధామ్ ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. సత్యజీత్ దూబే, ప్లబితా బోత్లాకుర్, నీలు డోగ్రా కీలక పాత్రల్లో నటించిన సినిమా ప్యార్ టెస్టింగ్. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. కావేరి కపూర్, వర్ధన్ పూరీ, నిషా ఆలియా, అతుల్ శర్మ లు నటించిన మూవీ బాబీ ఆర్ రిషి కీ లవ్ స్టోరీ ఈ మూవీ ఫిబ్రవరి 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అయింది.
మరికొన్ని సినిమాలు మీకోసం..
ఈటీవీ విన్:
సమ్మేళనం (తెలుగు) - ఫిబ్రవరి 13
సోనీ లివ్ ఓటీటీ:
మార్కో (తెలుగు)- ఫిబ్రవరి 14
నెట్‌ఫ్లిక్స్:
డెత్ బిఫోర్ ది వెడ్డింగ్ (ఇంగ్లీష్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 12
లా డోల్సీ విల్లా (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ మూవీ)- ఫిబ్రవరి 13
ది ఎక్స్‌చేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13
సర్వైవింగ్ బ్లాక్ హాక్ డౌన్ (ఇంగ్లీష్ వార్ బేస్‌డ్ డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 10
కాదలిక్క నేరమిల్లై (తెలుగు డబ్బింగ్ తమిళ మూవీ)- ఫిబ్రవరి 11
ది విచర్: సైరెన్స్ ఆఫ్ ది డీప్ (ఇంగ్లీష్ అడల్ట్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 11
కోబ్రా కై సీజన్ 6 పార్ట్ 3 (ఇంగ్లీష్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13
ఐయామ్ మ్యారీడ్.. బట్! (కొరియన్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్- ఫిబ్రవరి 14
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 8 (ఇంగ్లీష్ రియాలిటీ షో)- ఫిబ్రవరి 14
మెలో మూవీ (కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 14
లయన్స్ గేట్ ప్లే:
సబ్‌సర్వియన్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)- ఫిబ్రవరి 14
హోయ్‌చోయ్:
బిషోహోరి (బెంగాలీ సూపర్ నాచురల్ హారర్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13
అమెజాన్ ప్రైమ్:
మై ఫాల్ట్: లండన్ (బ్రిటీష్ రొమాంటిక్ డ్రామా)- ఫిబ్రవరి 13
జీ5:
ప్యార్ టెస్టింగ్ (హిందీ)- ఫిబ్రవరి 14
ఆహా:
డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ (తెలుగు రియాలిటీ డ్యాన్స్ షో)- ఫిబ్రవరి 14
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
బాబీ ఔర్ రిషికి లవ్ స్టోరీ (హిందీ లవ్ అండ్ రొమాంటిక్ సినిమా)- ఫిబ్రవరి 11
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications