మహేశ్ బర్త్ డే ట్రీట్ మామూలుగా లేదుగా.. 'వారణాసి' నుంచి ఏకంగా..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' ఈ మూవీపై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన వారణాసి ఇంటూ ది వరల్డ్ ట్రైలర్ తో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఈ మూవీ ఆకర్షించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి అయింది. మిగిలిన 20 శాతం షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం కేటాయించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Ramayana: 100 కోట్ల వ్యూస్ తో 'రామాయణ' సంచలన రికార్డ్..
Ramayana: 100 కోట్ల వ్యూస్ తో 'రామాయణ' సంచలన రికార్డ్..

మరోవైపు ఆగస్టు 9 న సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారణాసి మూవీ నుంచి ఏదైనా గ్లింప్స్ లేదా పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు ఈ మూవీ హీరోయిన్ ప్రియాంక చోప్రా బర్త్ డే సందర్భంగా వారణాసి మూవీ నుంచి పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ మూవీలో విలన్ పాత్ర చేస్తున్న మలయాళీ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ బర్త్ డే సందర్భంగా కూడా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేశ్ బర్త్ డే కానుకగా వారణాసి మూవీ నుంచి పోస్టర్ లేదా గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకూ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

varanasi movie Superstar Mahesh Babu and ace director SS Rajamouli has planned it meticulously

ఇక సాధారణంగా రాజమౌళి సినిమాలు వాయిదా పడుతూ ఉంటాయి. అనుకున్న సమయానికి రిలీజ్ కావనే విమర్శ ఉంది. అయితే ఈ సినిమాను మాత్రం ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇదివరకు చెప్పినట్లుగానే వచ్చే ఏడాది ఏప్రిల్ 7 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీని గ్లోబల్ ఆడియన్స్‌ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. కథ, విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌ తో పాటు అత్యాధునిక సాంకేతికత ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+