ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మూవీ.. నిమిషానికో మలుపు.. సినిమా చూస్తే పిచ్చోళ్లవుతారు..!!

మలయాళం యాక్షన్ సినిమాలు అంటే ఎవరికైనా ఇష్టమే.. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు మలయాళం యాక్షన్, థ్రిల్లర్ సినిమాలను విపరీతంగా చూస్తుంటారు. మలయాళం సినిమాల్లోకి గ్రిప్పింగ్ నేరేషన్, టేకింగ్, థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్టుల మీద ట్విస్టులు మరే ఇండస్ట్రీలోనూ ఉండవు. అందుకే మలయాళం సినిమాలు అక్కడి కంటే మిగతా రాష్ట్రాల్లోనే బాగా ఆడుతుంటాయి. అయితే ఇటీవల థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన 'వరవు' అనే ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి రచ్చ రచ్చ చేస్తోంది.

నిమిషానికో మలుపు.. గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఈ సినిమా సొంతం. టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన వరవు మూవీ సెప్టెంబర్ 11 నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు.

అలాగే ఏకే సాజన్ కథ అందించారు. ఇక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో క్లైమాక్స్ ను అద్భుతంగా తెరకెక్కించారు. నరాలు తెగే ఉత్కంఠతో సాగే ఈ సినిమాలో జోజు జార్జ్ నటనకు ఆడియన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. ఇక వరవు సినిమాలో జోజు జార్జ్ తో పాటుగా అర్జున్ అశోకన్, మురళి గోపి, సానియా అయ్యప్పన్, దీపక్ పరంబోల్, బాబురాజ్, వాణి విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించారు.

Varavu The Malayalam action movie starring Joju George streaming on ZEE5 OTT platform from Sept 11

ఇక వరవు మూవీ స్టోరీ విషయానికి వస్తే.. పాల్సన్(జోజు జార్జ్) చేయని నేరానికి జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అయితే అతని అక్క(నన్) వ్యాటికన్ వెళ్లే క్రమంలో ఆమెను కలిసేందుకు 10 రోజుల పెరోల్ మీద పాల్సన్ బయటకు వస్తాడు. అయితే అందరూ తన అక్క కోసం పాల్సన్ వచ్చాడని అనుకుంటారు. కానీ అతను వచ్చింది మాత్రం తనను అన్యాయంగా జైలుకు పంపించి.. తన కుటుంబాన్ని నాశనం చేసిన ఊరిలోని పెద్ద మనుషుల మీద రివెంజ్ తీర్చుకోవడానికేనని ఎవరికీ తెలియదు.. మరి ఈ పది రోజుల్లో విలన్లను పాల్సన్ ఎలా అంతం చేశాడు..? అనేదే స్టోరీ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+